Thursday, 29 June 2017

అన్ని గ్రహాల మీద రోజుకి 24 గంటలు ఉండవా ? / ANNI GRAHALA MEEDHA 24 GANTALU VUNDAVA?


ఒక పగలుని , ఒక రాత్రిని కలిపి మనం రోజు అంటున్నాము.ఏ గ్రహానికి సంబంధించిన  రోజు ఐనా ఆ గ్రహం తన చుట్టూ తాను ఒకసారి పూర్తిగా తిరిగే  సమయం మీద ఆధారపడీ ఉంటుంది.భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు స్థూలంగా 24 గంటలు పడుతుంది.

అందుకే ఇక్కడ ఒక పగలు ,ఒక రాత్రి పూర్తయ్యేందుకు 24 గంటల సమయం పడుతుంది.కాని అన్ని గ్రహాల సంగతి అలా ఉండదు.ఉదాహరణకు గురు గ్రహం తనచుట్టూ తాను మన భూమి కన్నా చాలా వేగంగా తిరుగుతుంది.అందుకని అక్కడ 10 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది.అంటే ఆ గ్రహం మీద 5 గంటలు పగలు, 5 గంటలు రాత్రి ఉంటుందన్నమాట.అలాగే కుజ గ్రహం మన భూమి అంత వేగంతోనే తిరగడం వల్ల మన రోజుకు అక్కడి రోజుకు పెద్ద తేడా ఏమి ఉండదు.మన రోజుకన్నా అక్కడి రోజులో ఒక 37 నిమిషాలు ఎక్కువగా ఉంటాయంతే.ఇక బుధ గ్రహం మన భూమి కన్నా చాలా నిదానంగా తిరుగుతుంది.మన భూమి మీద 59 రోజులు గదిస్తే కాని అక్కడ ఒక రోజు పూర్తి కాదు.అంటే అక్కడ ఒక రోజుకి 1,416 గంటలన్నమాట.ఇక శుక్రగ్రహం మీదైతే 5832 గంటలు గడిస్తే కాని రోజు పూర్తి కాదు.భూమి మీద 243 రోజులు పూర్తైతే అక్కడ ఒక రోజు పూర్తవుతుంది.అలాగే ఉరేనస్ 16 గంటల 48 నిమిషాలు,నెఫ్త్యూన్ 18 గంటలుఫ్లూటో 168 గంటలు సమయాన్ని ఒక రోజు పూర్తి చేయడానికి తీసుకుంటాయి.ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే సమయాల్లో కూడా చాలా తేడా ఉంటుంది.

భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS


ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.

లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.

ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను   లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )

ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.

జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.

కంప్యూటర్ కి వైరస్ ఎందుకు వస్తుంది? / COMPUTER KI VIRUS YENDHUKU VASTHUNDHI?




కంప్యూటర్ ని పని చేయించేదుకు మనం కొన్ని కమాండ్స్ ఇస్తాము.ఈ కమాండ్స్ అన్నిటిని కలిపి సాఫ్ట్ వేర్ అంటారు.కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్ వేర్ నిర్ణయిస్తుంది.కంప్యూటర్ పనితీరు గురించి బాగా అవగాహన ఉన్నవారు సరదా కోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్ వేర్ లను తయారు చేస్తారు.ఇవి కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం , పని చేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వ ఉన్న సమాచారం అంతా చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి.ఇలాంటి సాఫ్ట్ వేర్ లనే  వైరస్ అంటారు.అందుకే కంపెనీలు తయారు చేసిన వైరస్ లేని సాఫ్ట్ వేర్ లను వాడడం మంచిది.ఇంటర్నెట్నుంచి సమాచారం తీసుకునేటప్పుడు , మెయిల్ చేసేటప్పుడు,కొత్త సాఫ్ట్ వేర్ లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మానవ వైరస్ లకు టీకాలు ఎలాగో , కంప్యూటర్ వైరస్ లను యాంటివైరస్ సాఫ్ట్ వేర్ లను వాడి తొలగించుకోవచ్చు.


Saturday, 24 June 2017

మన వెంట్రుకలు నల్లగా ఎందుకు ఉంటాయి? / MANA VENTRUKALU NALLAGA YENDHUKU UNTAYI?


ప్రపంచంలోని మనుషులందరి వెంట్రుకలు నల్లగా ఉండవు.కొందరివి రాగి వర్ణంలో ఉంటే ,మరి కొందరివి బంగారు వర్ణంలో ఉంటాయి.ఉష్ణ ప్రాంతంలో నివసించే వారి వెంట్రుకలు సాధారణంగా నల్లగానే ఉంటాయి.ఇది ఒక విధంగా ప్రకృతి వరణం కిందికి వస్తుంది.ఎందుకంటే నల్లటి వస్తువులు ఉష్ణాన్ని చక్కగా గ్రహించటమే కాకుండా సులువుగా వదిలిపెడతాయి కూడా.ఈ ఏర్పాటు ఉష్ణప్రాంతాలవారికి సహాయపడేదిగా ఉంటుంది.ఐతే వెంట్రుకలు నల్లగా ఉండటానికి ,కెరొటిన్ అనే పదార్థానికి అవినాభావ సంబంధం ఉంది.వెంట్రుకల్లో కెరొటిన్ ఉంటేనే అవి నల్లగా కనబడతాయి.ఇది లోపిస్తే వెంట్రుకలు నలుపు రంగుని కోల్పోతాయి.వృద్ధాప్యంలో కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వెంట్రుకలు తెల్ల బడతాయి.వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా ఇతర కారణాలతో కూడా కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు.అస్తవ్యస్తంగా ,తీవ్ర ఒత్తిళ్ళ తో కూడిన జీవన శైలి వల్ల , శరీర ధర్మం వల్ల,వంశపారంపర్య లక్షణాల వల్ల,విపరీతమైన చింతల వల్ల కొందరికి చిన్నతనంలోనే జుత్తు నెరసిపోవచ్చు.ఐతే ఇలా జుత్తు నెరసిపోవడం వ్యాధి కాదు.

Monday, 19 June 2017

చంద్ర మండలంపై శబ్దాన్ని వినలేము ఎందుకు? / CHANDRAMANDALAM PAI SHABDHANNI VINALEMU YENDHUKU?


కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తరంగం అవడం వల్ల దీని ప్రసారానికి యానకం కావాలి.అనగా ఘన,ద్రవ,వాయు పదార్థాలలో,ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కంపనాల వల్ల ధ్వని పుడుతుంది.శూన్యంలో యానకం ఉండదు కాబట్టి కంపనాలు జరగవు.అందువల్ల ధ్వని జనించదు.కాబట్టి శూన్యంలో లేదా చంద్రునిపై శబ్ద వేగం సున్నా .అందుకే మనిషి చంద్ర మండలం పై మామూలుగా మట్లాడడానికి వీలు కాదు.అంతే కాక చప్పట్లు కొట్టినా,తుపాకి పేల్చినా ,బాంబు పేల్చినా వాటి శబ్దాలేవీ మన చెవిని చేరవు.అందుకే చంద్రునిపై ధ్వని వినలేము అంటారు.

Monday, 12 June 2017

రక్తంలో ఏమేం ఉంటాయి? / RAKTHAM LO YEMEM VUNTAYI?


రక్తం ఒక ద్రవ రూప కణజాలం.మన రక్తంలో 55% ద్రవ రూప ప్లాస్మాతోనూ,మరో 45% వివిధ రకాల కణాలతో కలిపి ఉంటుంది.రక్త కణాల్లో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు , తెల్ల రక్త కణాలు , రక్త కణ ఫలకికలు / ప్లేట్ లెట్స్ ఉంటాయి.
        కాగా రక్తంలోని ప్లాస్మాలో 92% నీరు ఉంటే ,ప్రొటీన్లు , అయాన్లు వంటివన్నీ కలిపి మిగతా 8% ఉంటాయి.ఐతే ఇది అన్ని రకాల జీవులకు ఒకే విధంగా ఉండదు.ఒకే కుటుంబానికి చెందిన జీవులైనప్పటికీ ,అవి వేర్వేరు రకాలకు చెందినవైనప్పుడు వాటి రక్త సాంద్రత కూడా వేర్వేరుగా ఉంటుంది.అలాగే ఆడ జీవుల రక్త సాంద్రతకు ,మగ జీవుల రక్త సాంద్రతకు తేడా స్పష్టంగా ఉంటుంది.మనం ఉండే భంగిమను బట్టి శరీరంలోని వివిధ అవయవాల వద్ద రక్త సాంద్రతలో తేడా ఉంటుంది.ఉదాహరణకు కూర్చున్నప్పటికన్నా నిలబడి ఉన్న సమయంలో మన శరీరంలోని కొన్ని ప్రాంతాలలో రక్త సాంద్రత హెచ్చుగా ఉంటుంది.రక్తం నిర్వహించే ధర్మాన్ని బట్టి మొత్తం జంతువులను ప్రధానంగా ఉష్ణ రక్త జీవులు , శీతల రక్త జీవులుగా వర్గీకరించారు.మనం ఉష్ణ రక్త జీవుల కిందికి వస్తాము.ఈ కోవకు చెందిన జంతువుల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.ఆ విధంగా చేసే యంత్రాంగం ,ఏర్పాట్లు వాటి శరీరంలో ఉంటాయి.ఇక శీతల రక్త జీవుల శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది.ఏదేమైనా మేధస్సు విషయంలో శీతల రక్త జీవుల కన్నా ఉష్ణ రక్త జీవులు ముందంజలో ఉన్నాయి.

Thursday, 8 June 2017

THOLI MAHILA YUDDHA VIMANA PILOTS / తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లు

తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లు

భారత వాయుసేనలో మొట్ట మొదటి ఫ్లైయింగ్ ఆఫీసర్లుగా ఎంపికై రికార్డు సృష్టించిన భావనా కాంత్ , మోహనా సింగ్ ,అవనీ చతుర్వేది 
పశ్చిమ బెంగాల్ లోని కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో బ్రిటిష్ హాక్ విమానాలతో శిక్షణ పొందారు.మొదటి దశలో వారికి అధునాతనమైన ఎస్ యు 30 విమనలు కెటాయిస్తున్నారు.2015 అక్టోబర్ లో ఫైటర్ పైలట్ ల ఎంపికలో మహిళల ప్రవేశం పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. 


Wednesday, 7 June 2017

జనరేటర్ ఎలా పని చేస్తుంది? / GENERATOR YELA PANI CHESTHUNDI?


ఏదైనా ఒక యానకం నుండి ఎలక్ట్రానులు ఒక నిర్దిష్ట దిశలో,నిర్దిష్ట వేగంతో ప్రయాణించడాన్నే మనం విద్యుత్తు అని అంటున్నాము.ఇలా ప్రవహించడం ద్వారా పుట్టే శక్తిని ఉష్ణ శకి గానూ,కాంతి శక్తిగానూ,చలన శక్తి, అంకా యాంత్రిక శక్తి వంటి రకరకాల శక్తి రూపాలలోకి మార్చి మన అవసరాలకు వాడుకుంటున్నాము.ఉదాహరణకు కరంటు బల్బు ద్వారా విద్యుత్ ను కాంతి రూపంలోకి మార్చుకుంటే ,కరంట్ స్తవ్ ద్వారా దానిని ఉష్ణ శక్తి గా మార్చుకుని వాడుకుంటున్నాము.విద్యుత్ కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి,అయస్కాంత తత్వానికి ఒక విడదీయలేని సంబంధం ఉంది.ఎలాగ అంటే ఒక తీగ గుండా ఒక నిర్దిష్ట దిశలో ఎలక్ట్రానులు ప్రవహించేలా చేసినప్పుడు  ఆ తీగ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.అదే విధంగా ఏదన్నా ఒక తీగ మీదుగా ఒకే దిసలో అయస్కాంతాన్ని కదిలించినప్పుడు,అయస్కాంతానికి సంబంధించిన అయస్కాంత శక్తి తీగలోని ఎలక్ట్రానులను ఆ దిశలో ముందుకు చలించేలా చేస్తుంది.జనరేటర్ కూడా సరిగ్గా ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని పని చేస్తుంది.జనరేతర్ లో ఉండే అయస్కాంతం ఒక వైరుకు దగ్గరగా కదలడం ద్వారా ఆ వైరులోని ఎలక్ట్రానులు నిలకడగా ప్రవహించేలా చేస్తుంది.ఒక విధంగా చూస్తే అచ్చం ఒక నీటి పంపు పనిచేసేటట్లుగానే జనరేటర్ కూదా పని చేస్తుందని చెప్పవచ్చు.నీటి పంపు ఒక నిర్దిష్ట మొత్తంలోని నీటి అణువులను కదిలించడమే కాకుండా ,వాటిపై ఒక నిర్దిష్ట మొత్తంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.సరిగ్గా ఇదే విధంగా జనరేటర్ కూడా నిర్దిష్ట మొత్తంలో ఎలక్ట్రానులను లాగడమే కాకుండా వాటిపై నిర్దిష్ట పరిమాణంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.దానితో ఆ ఎలక్ట్రానులు విధిగా ముందుకు ప్రయాణించి విద్యుత్తును సృష్టిస్తాయి.జనరేటర్ పనిచేసినంత సేపు ఈ చర్య నిరంతరంగా కొనసాగుతూ మనకు కావలసినంత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.

కంప్యూటర్ పక్కనున్న సెల్ ఫోన్ నుండి కీచు కీచు శబ్దాలెందుకు వస్తాయి? / COMPUTER PAKKANUNNA CELLPHONE NUNDI SHABDALENDUKU VASTAAYI?


ఇలా శబ్దాలు రావడానికి కారణం కంప్యూటర్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు / రేడియో తరంగాలు సెల్ ఫోన్ లోని తరంగాలతో జోక్యం చేసుకోవడమే.కరెంట్ తో పని చేసే ప్రతి వస్తువు నుండి రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.వీటిలో మారుతున్న విద్యుత్ ప్రవాహాలు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.భారీ యంత్రాలు పని చేస్తున్నపుడు ధ్వని తరంగాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలా కరెంట్ పై పని చేసే కంప్యూటర్లు , సెల్ ఫోనుల్లో రేడియో తరంగాలు ఉత్పన్నమౌతాయి.కంప్యూటర్లు స్వాభావికంగా శబ్దాలను వెలువరిస్తుంటాయి.ఎందుకంటే దానిలో వేగంగా మారుతున్న విద్యుత్ ప్రవాహాలు అందులోని సంకేతాలను మారుస్తాయి కాబట్టి.కంప్యూటర్లు , లాప్టాప్లకు అతి సమీపంలో ఉన్న సెల్ ఫోన్ నుండి శబ్దాలు వెలువడటానికి ఒక కారణం కంప్యూటర్ నుండి వెలువడే రేడియో తరంగాల పౌన:పున్యం సెల్ ఫోన్ పనిచేసే రేదియో తరంగాల పౌన:పున్యానికి సమానంగా ఉండటమే.అంటే సెకనుకు 800 మిలియన్ల సైకిల్స్ / 800 మెగా హెడ్జ్. హెడ్జ్ అనేది పౌన:పున్యానికి ప్రమాణం.మరో కారణం కంప్యూటర్ వెలువరించే రేడియో తరంగాలు, సెల్ ఫోన్ లోని స్పీకర్ పనిచేయడానికి వీలుగా దానికి అనుసంధానించి ఉండే ఆంప్లిఫయర్లో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపింప చేయడంతో సెల్ ఫోన్ లో కీచు కీచు మనే శబ్దాలు,ఒక్కోసారి రింగ్ వస్తుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా వరకు మెటల్ బాక్స్ లోనో లేక వాటిపై లోహ సంబంధిత పూతలు పూసి ఉండటంతో వాటిలో ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలు వెలుపలికి రాకుండా పట్టి ఉంచుతాయి.కానీ ఆ పరికరాల్లో అతి సన్నని రంధ్రాలు ఉంటే వాటి గుండా వచ్చే రేడియో తరంగాలు, వాటికి దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభావితం చేస్తాయి.అందువల్లనే కంప్యూటర్లకు దగ్గరగా ఉండే సెల్ ఫోనుల్లో కీచు కీచు మనే శబ్దాలు వస్తాయి.

Tuesday, 6 June 2017

అంతరిక్షంలో కూడా విద్యుత్ ను పుట్టించవచ్చా? / ANTHARIKSHAM LO KOODA VIDYUTH NU PUTTINCHAVACHA?


భూవాతావరణాన్ని దాటాక సౌరశక్తి చాలా తీవ్రంగా ఉంటుంది.నేలను తాకే సూర్య రశ్మికన్నా భూవాతావరణాన్ని దాటాక లభించే సూర్యరశ్మి సుమారు 5 రెట్లు శక్తివంతంగా ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.దాంతో అంతరిక్షంలోనే సౌరవిద్యుత్తును తయారు చేసి దానిని ఏదో ఒక రూపంలో భూమికి తీసుకురాగలిగినట్లైతే విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.ఈ విషయంలో జపాన్ శాస్త్రజ్ఞులు మరో అడుగు ముందుకు వేసి రోదసిలో ఓ స్పేస్ సోలార్ పవర్ సిస్టం అనే ఒక మంచి ప్రాజెక్టును ప్రారంభించారు.దీనిలో భాగంగా భూవాతావరణం దాటాక,భూస్థిరకక్ష్యలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద, అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ' ఫొటో ఓల్టాయిక్ డిష్ లను ఏర్పాటు చేస్తారు.ఆ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలలాగే ఈ డిష్ లు కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతో సమానంగా తిరుగుతూ,నేలపై నుంచి ఎప్పుడు చూసినా ఒకే ప్రదేశం వద్ద ఉన్నట్లు కనిపిస్తాయి.అంతరిక్షంలోని ఈ డిష్ లు అపరిమితంగా లభించే సౌరశక్తిని గ్రహించి,దానిని లేజర్ కిరణాల రూపంలో గాని,సూక్ష్మ తరంగాల రూపంలో గాని నేలకు పంపిస్తాయి.వీటి ద్వారా భూమిపై పెద్దమొత్తంలో విద్యుత్ ను పుట్టించి,వాడుకునేందుకు వీలవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.ఇది విజయవంతమైతే మిగతా దేశాలు కూడా ఇలాంటి వినూత్న పద్ధతులకు సన్నద్ధం కావచ్చు.

జలుబు,దగ్గులాంటివి,వానాకాలం,చలి కాలాల్లోనే ఎందుకొస్తాయి?మిగతా కాలాల్లో ఎందుకు రావు?JALUBU,DAGGU LANTIVI VANAKALAM,CALI KALAMLONE ENDUKOSTAYI?MIGATA KALALLO ENDUKU RAVU.?


జలుబు సాధారణంగా వైరస్ ద్వారా వస్తుంది.వాతావరణంలోనూ,తాగే నీటిలోనూ,దుమ్ము,ధూళి కణాలపైన వైరస్ ఉంటుంది.బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్ లు వృద్ధి కాలేవు.ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్యక్టీరియా ,ఇతర సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది.వాట్పై ఆధారపడే వైరస్ లు కూడా తక్కువగానే ఉంటాయి.ఎక్కడపడితే అక్కడ తడి ఉండకపోవడం వల్ల వైరస్ ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ.కాబట్టి జలుబు కలిగించే వైరస్ ల ప్రభావం తక్కువగా ఉంటుంది.వానా కాలంలో నీరు వివిధ పదార్థాలను తనతో తీసుకెల్తుంది.ఇవి తాగునీటి వనరులనూ కలుషితం చేస్తాయి.వైరస్ ల వ్యాప్తికి దోహద పడతాయి.వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా,దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది.తద్వారా వైరస్ ల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. 

Sunday, 4 June 2017

ఈతగాళ్ళు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? / EETHAGALLU PRATHYEKAMAINA KALLADDHALU YENDHUKU PETTUKUNTARU?


కాంతికిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక నిర్దిష్టకోణంలోనికి వంగుతాయి.ఇంకోలా చెప్పాలంటే అలాంటి సందర్భాలలో వాటి ప్రయాణమార్గంలో మార్పు వస్తుంది.దీనినే వక్రీభవనం అంటారు.వస్తువు నుంచి పరావర్తనం చెంది బయలుదేరే కాంతి ముందుగా గాలిలోనూ ,ఆ తరువాత మన కంటి పైభాగంలోనూ రెండు సార్లు వక్రీభవనానికి గురై ,చివరకు రెటీనాపై పడుతుంది.ఆ విధంగా మనకు ఒక వస్తువు లేదా దృశ్యం కనిపిస్తుంది.కాని ఒక వేల గాలి వక్రీభవనగుణకం ,మన కంటి వక్రీభవన గుణకం ఒకేవిధంగా ఉన్నట్లైతే ఆయా వస్తువులను చూడడం మనకు చాలా కష్టమౌతుంది.దానికి భిన్నంగా నీటి వక్రీభవన గుణకం ,మన కంటి వక్రీభవన గుణకం దాదాపుగా ఒకేలా ( 1.34 ) ఉంటాయి.ఇలా రెండు యానకాల వక్రీభవన గుణకాలు సమానంగా ఉన్నప్పుడు ,ఒక యానకం నుండి మరొక యానకంలోనికి కాంతి దూసుకుపోయినప్పుడు గమన మార్గంలో ఎటువంటి మార్పు రాక అది సూటిగా దూసుకు పోతుంది.అలాంటి సమయాల్లో వస్తువులను చూడడం మనకు కష్టమౌతుంది.నీటిలో ఉన్నప్పుడు ఈ కారణంగానే మనకు వివిధ వస్తువులు ,జలచరాలు స్పష్టంగా కాకుండా అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి.ఇలా జరగకుండా ఉండడం కోసమే సముద్రంలో ఈదే వాళ్లు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరిస్తారు.ఈ కళ్ళద్దాలలో గాజుపలకల మధ్య గాలి నిండి ఉంటుంది.నీటిలోంచి వచ్చిన కిరణాలు గాలిలోనికి ప్రవేశించి , ఆ తర్వాతే కళ్ళలోకి వస్తాయి.దాంతో అవి వేర్వేరు వక్రీభవనాలకు గురై చివరకు ఆ వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...