Friday 31 August 2018

శీతల వాతావరణంలో కొండలు పెద్దవిగా కనిపిస్తాయి.ఎందుకు?



వాతావరణంలో నీటి బిందువులు ఉండటం వల్ల వక్రీభవన గుణకం పెరుగుతుంది.అందువల్ల ప్రతి వస్తువూ కొణాకారంగా మారుతుంది.కావున శీతల వాతావరణంలో కొండలూ, ఇతర వస్తువులూ పెద్దవిగా కనిపిస్తాయి.

ఎండ మండిపోతున్న రోజు కూడా సరస్సులో నీరు చల్లగా ఉంటుంది.ఎందుకు?


గుప్తోష్ణం రూపంలో ,విశాలంగా ఉండే సరస్సు ఉపరితలం నుంచి జరిగే భాష్పీభవన కాలంలో నీటి నుంచి గణనీయమైన మొత్తంలో ఉష్ణం వదిలిపోవడం వల్ల ఎంత ఎండ
 లోనైనా సరస్సులో నీరు చల్లగా ఉంటుంది.

Tuesday 28 August 2018

ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ?

ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ?

తలతన్యత నియమాన్ననుసరించి ద్రవాలు గుండ్రని బిందువులుగా మారతాయి

Monday 20 August 2018

కొన్ని సమయాలలో ఎత్తైన ప్రాంతాలలో ,ముక్కు నుంచి రక్తం కారుతుంది ఎందుకు?


ఎత్తైన ప్రాంతాలలో వాతావరణ పీడనం తగ్గిపోతుంది.వాతావరణ పీడనం కంటే రక్త పోటు ఎక్కువ కావడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమౌతుంది

చంద్ర సముద్రం అంటే ఏమిటి?

చంద్ర సముద్రం అంటే ఏమిటి?

చంద్రుడి మీద కనిపించే నల్లటి మైదానాన్నే ' చంద్ర సముద్రం ' అంటారు.

Wednesday 1 August 2018

గొలుసు లాగితే రైలు ఎందుకు ఆగిపోతుంది?


రైల్లో బ్రేకులు వ్యాక్యూం పద్ధతిలో పని చేస్తాయి.గొలుసు లాగినపుడు వ్యాక్యూం తొలగిపోయి ,గొట్టాల్లోకి గాలి ప్రవేశిస్తుంది.ఇది బ్రేకుల మీద ఒత్తిడి ఏర్పరుస్తుంది.దీనివల్ల చక్రాలు స్తంభించి రైలు ఆగిపోతుంది.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...