Showing posts with label ఏమిటి?/YEMITI/WHAT?. Show all posts
Showing posts with label ఏమిటి?/YEMITI/WHAT?. Show all posts

Monday, 24 December 2018

సాధారణ థర్మా మీటర్ ,క్లినికల్ థర్మా మీటర్ల మధ్య తేడా ఏమిటి?


సాధారణంగా థర్మా మీటర్ అనగానే మనకు ఆసుపత్రిలో మనకు పరీక్ష చేసే పరికరం గుర్తుకు వస్తుంది.ఈ క్లినికల్ థర్మా మీటర్ లో బల్బ్ దగ్గర ఒక నొక్కు ఉంటుంది.అందువల్ల గొట్టంలో ఒక స్థాయికి పెరిగిన పాదరసం విదిలించనిదే కిందికి దిగదు.ఆ విధంగా అది ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుంది.సాధారణ థర్మా మీటర్ లో ఈ ఏర్పాటు ఉండదు.

Saturday, 22 December 2018

ఓటింగ్ శాతం తగ్గితే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందా?


ఓటింగ్ శాతం పెరిగినా,తగ్గినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.40% పోలింగ్ జరిగే నియోజక వర్గాలు కొన్ని ఉంటే ,90% జరిగేవి మరికొన్ని ఉంటాయి.ఐనా అన్నింటిలో ఓటింగ్ సరళి ఒకేలా ఉంటుంది.కేవలం ఒక్క శాతం ఓటర్లను ప్రశ్నించి చేసే సర్వేల్లోనే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోతోంది.అలాంటప్పుడు పోలింగ్ శాతంలో తేడా ఫలితాన్ని మార్చుతుందని అనుకోలేము.

ఎన్నికల పట్ల ప్రజలలో ఆసక్తి లేనప్పుడు ,ఏదైనా పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకెళ్ళవచ్చు.ఐతే వారు ఆ పార్టీకే ఓటు వేస్తారని అనుకోవడం పొరబాటు అవుతుంది.ఐదేళ్ళ పరిశీలన ద్వారా తీసుకున్న నిర్ణయం కేవలం ఒక్క అనుభవంతో మారిపోదు.

Monday, 17 December 2018

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?


ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ ' అంటారు.ఈ పరిజ్ఞానం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి.విమాన పైలట్లకు శిక్షణనివ్వడంలో అవసరమైన సిమ్యులేషన్ ప్రక్రియలలో దీనిని వాడుతున్నారు.ఇంజనీర్లు,ఆర్కిటెక్ట్ లు ,భవన నిర్మాణ ప్రక్రియలు ప్రారంభం కాకముందే భవనాలు ఎలా ఉంటాయో చూపడానికి ,వీడియో,కంప్యూటర్ గేంస్ లోనూ ఈ పరిజ్ఞానం తోడ్పడుతోంది.అమెరికాలోని మానసిక వైద్యులు ఎత్తైన ప్రదేశాలపై గల మానసిక భయాలను ఈ పద్ధతి ద్వారా సృష్టించే గ్లాస్ ఎలివేటర్ల ద్వారా తొలగిస్తున్నారు.

Friday, 14 December 2018

నీటి మీద తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి?/ PUMICE STONES

నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.ఫ్యుమైస్ స్టొన్స్ గా వ్యవహరించే ఈ రాళ్లు ఏళ్ల తరబడి నీటిపై తేలడం వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది చాలా కాలం వరకు అంతుబట్టలేదు.ఈ చిక్కుముడిని విప్పడానికి లారెన్స్ బెర్క్ లీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.వారి పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.ఎక్ష్ రే ల సహాయంతో రాళ్లను పరీక్షించగా మన చర్మంపై ఉన్న రోమాల తరహాలో ఈ రాళ్లపై సూక్ష్మ స్థాయిలో రంధ్రాలు ఉన్నాయని తేలింది.వీటితో పాటు రాళ్లలో రకరకాల వాయువులు ఉన్నట్లు గుర్తించారు.అంతర్భాగంలో చిక్కుకుపోయిన ఈ వాయువుల కారణంగానే ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని నిర్ధారణకు వచ్చారు.

Friday, 7 December 2018

ఒక్క ఓటు తేడాతో జరిగిన ప్రముఖ సంఘటనలు / ఒక్క ఓటు విలువ తెలిపిన సంఘటనలు.



1 . 1999 లో కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం 1 ఓటు తేడాతోనే కూలిపోయింది.

2 . 1 ఓటు తేడాతో ఆంగ్లం / ఇంగ్లీషు పై గెలిచి హిందీ మన దేశ అధికార భాషగా గుర్తింపు పొందింది.

3 . 2004 లో కర్ణాటకలోని సంతెమరహళ్లి నియోజక వర్గం నుండి జేడిఎస్ అభ్యర్థి  ఎ.ఆర్ . కృష్ణమూర్తి 1 ఓటు తేడాతో  ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.

4 . 1776 లో 1 ఓటు తేడాతో అమెరికాలో జర్మన్ కు బదులుగా ఇంగ్లీష్ అధికార భాషగా మారింది.

5 . 1714 లో 1 ఓటు తేడాతో కింగ్ జార్జ్ 1 ఇంగ్లండ్ పీఠమెక్కారు.

6 . 1800 లో థామస్ జెఫర్సన్ , 1824 లో జాన్ క్వీన్స్ ఆడంస్ ,1876 లో రూథర్ఫర్డ్ హెంస్ లు ఎలక్టోరల్ కాలేజిలో 1 ఓటు తేడాతో అమెరికా అధ్యక్ష పదవులు చేఫట్టారు.

7 . 1923 నవంబర్ 8 న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 1 ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ తన ప్రత్యర్థిపై గెలిచారు.

8 . 2008 ఎన్నికల్లో రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సిపి జోషి 1 ఓటు తేడా తో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.కాంగ్రెస్ ను ముందుండి నడిపించిన ఆయన భాజపా అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఓడిపోయారు.చౌహాన్ కు 62,216 ఓట్లు రాగా జోషికి 62,215 ఓట్లు వచ్చాయి.ఒక్క ఓటే ఆయన భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. గెలిస్తే ఆయనే సిఎం అయ్యేవారు. నిజానికి ఆ ఎన్నికల్లో జోషి తల్లి,భార్య, కారు ద్రైవరు ఈ ముగ్గురూ ఓటు వేయలేదు. పైపెచ్చు తన ద్రైవర్ ను జోషియే ఓటేయకుండా ఆపారట వాళ్ళ మూడు ఓట్లు పడి ఉంటే ఆయనే సిఎం అయ్యేవారు.ఒక్క ఓటు విలువ ఎంతఒ చెప్పడానికి చక్కని ఉదాహరణ ఇది.

Tuesday, 4 December 2018

ఒకే రూపంలో ఉన్న కవలల వేలి ముద్రలు కూడా ఒకే విధంగా ఉంటాయా?

ఒకే రూపంలో ఉన్న కవలల వేలి ముద్రలు కూడా ఒకే విధంగా ఉంటాయా?

ఇద్దరు వ్యక్తులు కవలలైనా సరే ,వేలి ముద్రలు మాత్రం ఎప్పుడూ పరస్పరం జత కుదరవు

Saturday, 17 November 2018

ఆనకట్ట మందం పై నుంచి అడుగుకు పోయే కొద్దీ పెరుగుతుంది,ఇలా రూపొందించటానికి గల కారణమేమిటి?


కిందికి పోయే కొద్ది పార్శ్వ పీడనం పెరుగుతుంది.ఇది పై భాగాన శూన్యంగా ఉంటే కింది భాగాన గరిష్టంగా ఉంటుంది.అందువల్లనే ఆనకట్ట అడుగు భాగం పై భాగం కంటే ఎక్కువ మందంగా ఉంటుంది.

Saturday, 8 September 2018

విటమిన్ ' పి ' అంటే ఏమిటి ?



విటమిన్ ' పి ' యొక్క రసాయన నామం ' మెస్పిరిడిన్ చాల్ క్లోన్ '.నీటిలో కరిగే ఈ విటమిన్ పుల్లని పండ్లలోనూ ,ఆకుపచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది.

Monday, 20 August 2018

చంద్ర సముద్రం అంటే ఏమిటి?

చంద్ర సముద్రం అంటే ఏమిటి?

చంద్రుడి మీద కనిపించే నల్లటి మైదానాన్నే ' చంద్ర సముద్రం ' అంటారు.

Thursday, 29 June 2017

భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS


ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.

లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.

ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను   లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )

ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.

జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.

Monday, 12 June 2017

రక్తంలో ఏమేం ఉంటాయి? / RAKTHAM LO YEMEM VUNTAYI?


రక్తం ఒక ద్రవ రూప కణజాలం.మన రక్తంలో 55% ద్రవ రూప ప్లాస్మాతోనూ,మరో 45% వివిధ రకాల కణాలతో కలిపి ఉంటుంది.రక్త కణాల్లో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు , తెల్ల రక్త కణాలు , రక్త కణ ఫలకికలు / ప్లేట్ లెట్స్ ఉంటాయి.
        కాగా రక్తంలోని ప్లాస్మాలో 92% నీరు ఉంటే ,ప్రొటీన్లు , అయాన్లు వంటివన్నీ కలిపి మిగతా 8% ఉంటాయి.ఐతే ఇది అన్ని రకాల జీవులకు ఒకే విధంగా ఉండదు.ఒకే కుటుంబానికి చెందిన జీవులైనప్పటికీ ,అవి వేర్వేరు రకాలకు చెందినవైనప్పుడు వాటి రక్త సాంద్రత కూడా వేర్వేరుగా ఉంటుంది.అలాగే ఆడ జీవుల రక్త సాంద్రతకు ,మగ జీవుల రక్త సాంద్రతకు తేడా స్పష్టంగా ఉంటుంది.మనం ఉండే భంగిమను బట్టి శరీరంలోని వివిధ అవయవాల వద్ద రక్త సాంద్రతలో తేడా ఉంటుంది.ఉదాహరణకు కూర్చున్నప్పటికన్నా నిలబడి ఉన్న సమయంలో మన శరీరంలోని కొన్ని ప్రాంతాలలో రక్త సాంద్రత హెచ్చుగా ఉంటుంది.రక్తం నిర్వహించే ధర్మాన్ని బట్టి మొత్తం జంతువులను ప్రధానంగా ఉష్ణ రక్త జీవులు , శీతల రక్త జీవులుగా వర్గీకరించారు.మనం ఉష్ణ రక్త జీవుల కిందికి వస్తాము.ఈ కోవకు చెందిన జంతువుల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.ఆ విధంగా చేసే యంత్రాంగం ,ఏర్పాట్లు వాటి శరీరంలో ఉంటాయి.ఇక శీతల రక్త జీవుల శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది.ఏదేమైనా మేధస్సు విషయంలో శీతల రక్త జీవుల కన్నా ఉష్ణ రక్త జీవులు ముందంజలో ఉన్నాయి.

Wednesday, 7 June 2017

కంప్యూటర్ పక్కనున్న సెల్ ఫోన్ నుండి కీచు కీచు శబ్దాలెందుకు వస్తాయి? / COMPUTER PAKKANUNNA CELLPHONE NUNDI SHABDALENDUKU VASTAAYI?


ఇలా శబ్దాలు రావడానికి కారణం కంప్యూటర్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు / రేడియో తరంగాలు సెల్ ఫోన్ లోని తరంగాలతో జోక్యం చేసుకోవడమే.కరెంట్ తో పని చేసే ప్రతి వస్తువు నుండి రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.వీటిలో మారుతున్న విద్యుత్ ప్రవాహాలు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.భారీ యంత్రాలు పని చేస్తున్నపుడు ధ్వని తరంగాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలా కరెంట్ పై పని చేసే కంప్యూటర్లు , సెల్ ఫోనుల్లో రేడియో తరంగాలు ఉత్పన్నమౌతాయి.కంప్యూటర్లు స్వాభావికంగా శబ్దాలను వెలువరిస్తుంటాయి.ఎందుకంటే దానిలో వేగంగా మారుతున్న విద్యుత్ ప్రవాహాలు అందులోని సంకేతాలను మారుస్తాయి కాబట్టి.కంప్యూటర్లు , లాప్టాప్లకు అతి సమీపంలో ఉన్న సెల్ ఫోన్ నుండి శబ్దాలు వెలువడటానికి ఒక కారణం కంప్యూటర్ నుండి వెలువడే రేడియో తరంగాల పౌన:పున్యం సెల్ ఫోన్ పనిచేసే రేదియో తరంగాల పౌన:పున్యానికి సమానంగా ఉండటమే.అంటే సెకనుకు 800 మిలియన్ల సైకిల్స్ / 800 మెగా హెడ్జ్. హెడ్జ్ అనేది పౌన:పున్యానికి ప్రమాణం.మరో కారణం కంప్యూటర్ వెలువరించే రేడియో తరంగాలు, సెల్ ఫోన్ లోని స్పీకర్ పనిచేయడానికి వీలుగా దానికి అనుసంధానించి ఉండే ఆంప్లిఫయర్లో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపింప చేయడంతో సెల్ ఫోన్ లో కీచు కీచు మనే శబ్దాలు,ఒక్కోసారి రింగ్ వస్తుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా వరకు మెటల్ బాక్స్ లోనో లేక వాటిపై లోహ సంబంధిత పూతలు పూసి ఉండటంతో వాటిలో ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలు వెలుపలికి రాకుండా పట్టి ఉంచుతాయి.కానీ ఆ పరికరాల్లో అతి సన్నని రంధ్రాలు ఉంటే వాటి గుండా వచ్చే రేడియో తరంగాలు, వాటికి దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభావితం చేస్తాయి.అందువల్లనే కంప్యూటర్లకు దగ్గరగా ఉండే సెల్ ఫోనుల్లో కీచు కీచు మనే శబ్దాలు వస్తాయి.

Tuesday, 6 June 2017

జలుబు,దగ్గులాంటివి,వానాకాలం,చలి కాలాల్లోనే ఎందుకొస్తాయి?మిగతా కాలాల్లో ఎందుకు రావు?JALUBU,DAGGU LANTIVI VANAKALAM,CALI KALAMLONE ENDUKOSTAYI?MIGATA KALALLO ENDUKU RAVU.?


జలుబు సాధారణంగా వైరస్ ద్వారా వస్తుంది.వాతావరణంలోనూ,తాగే నీటిలోనూ,దుమ్ము,ధూళి కణాలపైన వైరస్ ఉంటుంది.బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్ లు వృద్ధి కాలేవు.ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్యక్టీరియా ,ఇతర సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది.వాట్పై ఆధారపడే వైరస్ లు కూడా తక్కువగానే ఉంటాయి.ఎక్కడపడితే అక్కడ తడి ఉండకపోవడం వల్ల వైరస్ ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ.కాబట్టి జలుబు కలిగించే వైరస్ ల ప్రభావం తక్కువగా ఉంటుంది.వానా కాలంలో నీరు వివిధ పదార్థాలను తనతో తీసుకెల్తుంది.ఇవి తాగునీటి వనరులనూ కలుషితం చేస్తాయి.వైరస్ ల వ్యాప్తికి దోహద పడతాయి.వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా,దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది.తద్వారా వైరస్ ల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. 

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...