Wednesday, 7 June 2017

కంప్యూటర్ పక్కనున్న సెల్ ఫోన్ నుండి కీచు కీచు శబ్దాలెందుకు వస్తాయి? / COMPUTER PAKKANUNNA CELLPHONE NUNDI SHABDALENDUKU VASTAAYI?


ఇలా శబ్దాలు రావడానికి కారణం కంప్యూటర్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు / రేడియో తరంగాలు సెల్ ఫోన్ లోని తరంగాలతో జోక్యం చేసుకోవడమే.కరెంట్ తో పని చేసే ప్రతి వస్తువు నుండి రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.వీటిలో మారుతున్న విద్యుత్ ప్రవాహాలు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.భారీ యంత్రాలు పని చేస్తున్నపుడు ధ్వని తరంగాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలా కరెంట్ పై పని చేసే కంప్యూటర్లు , సెల్ ఫోనుల్లో రేడియో తరంగాలు ఉత్పన్నమౌతాయి.కంప్యూటర్లు స్వాభావికంగా శబ్దాలను వెలువరిస్తుంటాయి.ఎందుకంటే దానిలో వేగంగా మారుతున్న విద్యుత్ ప్రవాహాలు అందులోని సంకేతాలను మారుస్తాయి కాబట్టి.కంప్యూటర్లు , లాప్టాప్లకు అతి సమీపంలో ఉన్న సెల్ ఫోన్ నుండి శబ్దాలు వెలువడటానికి ఒక కారణం కంప్యూటర్ నుండి వెలువడే రేడియో తరంగాల పౌన:పున్యం సెల్ ఫోన్ పనిచేసే రేదియో తరంగాల పౌన:పున్యానికి సమానంగా ఉండటమే.అంటే సెకనుకు 800 మిలియన్ల సైకిల్స్ / 800 మెగా హెడ్జ్. హెడ్జ్ అనేది పౌన:పున్యానికి ప్రమాణం.మరో కారణం కంప్యూటర్ వెలువరించే రేడియో తరంగాలు, సెల్ ఫోన్ లోని స్పీకర్ పనిచేయడానికి వీలుగా దానికి అనుసంధానించి ఉండే ఆంప్లిఫయర్లో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపింప చేయడంతో సెల్ ఫోన్ లో కీచు కీచు మనే శబ్దాలు,ఒక్కోసారి రింగ్ వస్తుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా వరకు మెటల్ బాక్స్ లోనో లేక వాటిపై లోహ సంబంధిత పూతలు పూసి ఉండటంతో వాటిలో ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలు వెలుపలికి రాకుండా పట్టి ఉంచుతాయి.కానీ ఆ పరికరాల్లో అతి సన్నని రంధ్రాలు ఉంటే వాటి గుండా వచ్చే రేడియో తరంగాలు, వాటికి దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభావితం చేస్తాయి.అందువల్లనే కంప్యూటర్లకు దగ్గరగా ఉండే సెల్ ఫోనుల్లో కీచు కీచు మనే శబ్దాలు వస్తాయి.

No comments:

Post a Comment

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...