Tuesday 17 July 2018

బాగా చలిగా ఉన్న రోజు చేతుల్ని వేడెక్కించడానికి చేతుల మీద నోటితో ఊదుకుంటాం ,ఐతే మనం తాగే కాఫీ వేడిగా ఉన్నపుడు ,దానిని చల్లబరచడానికి దాని మీద కూడా గాలిని ఊదుతాం,దీనిని ఎలా వివరించగలవు?


బాగా చలిగా ఉన్న రోజు ఒక వ్యక్తి తన చేతుల మీద గాలి ఊదుకునేటప్పుడు నోరు బాగా తెరిచి ఊదుతాడు.నోటి నుంచి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.ఆ విధంగా చేతులను వేడి చేసుకుంటాడు.ఐతే బాగా వేడిగా ఉన్న కాఫీని ఊదేటప్పుడు నోటిని అంత విశాలంగా తెరవడం జరగదు.బయటకు వచ్చే గాలి అత్యంత ఇరుకైన దారి గుండా మాత్రమే వస్తుంది.కాబట్టి బయటకు వచ్చే గాలి చల్లగా ఉంటుంది.ఈ కారణం వల్లనే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ఒక కంత ద్వారా వాయువు ప్రసరిస్తున్నపుడు శీతలీకరణ ప్రభావం ఉత్పన్నమౌతుంది

Monday 16 July 2018

డబుల్ డెక్కర్ బస్సు లో పై అంతస్తులోని ప్రయాణీకులను నిలబడనివ్వరు, ఎందుకు?

బస్సు గరిమనాభి పెరగకుండా ఉండడానికి ఇలా చేస్తారు.సమతుల్యత దెబ్బ తిని బస్సు పక్కకి ఒరిగిపోకుండా ఉండడానికి ఇది అవసరం.

కాంక్రీటు రోడ్లను దీర్ఘ చతురస్రాకార పలకలుగా రూపొందిస్తారు ఎందుకు?


ఎండాకాలంలో కాంక్రీటు రోడ్లు బాగా వేడెక్కి వ్యాకోచిస్తాయి.ఫలితంగా రోడ్డు మీద బీటలు పడే అవకాశం ఉంటుంది.కాంక్రీటు రోడ్డు దీర్ఘ చతురస్రాకారపు పలకలు వేడెక్కినపుడు వాటి మధ్య వేసినటువంటి తారును బయటకు నెడతాయి.అందువల్ల బీటలు వరే అవకాశం ఉండదు.

బాగా లోతైన బావి అడుగు భాగం నుంచి మధ్యాహ్నం పూట కూడా మనం నక్షత్రాలను చూడగలమా?


చూడగలం.ఎందుకంటే నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు సూర్య కిరణాల వల్ల అణగిపోదు.సూర్య కిరణాలు బావికి అంచుకు అడ్డంగా,తిర్యక్కుగా ఉంటాయి.కొన్ని నక్షత్రాలు నేరుగా బావి అడుగుకు కనిపించేట్లు ప్రకాశిస్తాయి.

Tuesday 10 July 2018

మన రెండు కళ్ళతో వస్తువులను రెండుగా చూడం ఎందుకు?


ఒక వస్తువుకు చెందిన రెండు ప్రతిబింబాలూ మన రెండు కళ్ళలోని రెండు రెటీనాలకు సంబంధించిన ఒకే భాగాల మీద సరిగ్గా పడతాయి.అందువల్ల పరివర్తనం కూడా ఏక కాలంలోనే జరుగుతుంది.అందువల్ల రెండు కళ్ళతోనూ ఒకే ఒక దృశ్యం చూడగలం.

Saturday 7 July 2018

ఒక పాత్రలో మండుతున్న పెట్రోల్ ను నీరు ఆర్పలేదు?


పెట్రోల్ మంట ఉష్ణం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత ఎక్కువగానంటే ఆ మంట మీద నీల్లు పొసినట్లైతే , ఆ నీరు వెంటనే వియోగం చెందుతుంది.అందువల్ల ఆ మంటను నీరు ఆర్పలేదు.

వర్షానికి ముందు మనకు చెమట ఎందుకు పోస్తుంది?


వర్షానికి ముందు వతావరణంలోని గాలి , నీటి ఆవిరితో సంత్రుప్తమౌతుంది. అందువల్ల చెమట పరిశోషం చెందకుండా చర్మానికే అంటిపెట్టుకొంటుంది.

భారీ రోడ్డు వాహనాలకు దీజిల్ నే యెందుకు వాడతారు?



అంతర్దహన యంత్రాలలో వాడే ఇతర ఇంధనంతో పోలిస్తే దీజిల్ కు అధిక సామర్థ్యం ఉంది. అంతే కాకుండా యెక్కువ పొదుపు కూడా.ఇది ఉత్పత్తి చేసే ఉష్నంలో దాదాపు 40% వినియోగమౌతుంది.దీజిల్ యింజన్ల మెకానిజం కూడా ఇతర ఇంజన్ల కంటే సులభంగా ఉంటుంది.

నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి.యెందుకు?



నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు ,వివిధ సాంద్రతలున్న వివిధ వాయు పొరల గుండా ప్రయణం చేయవలసి ఉంటుంది.అందువల్ల వక్రీభవనానికి లోనవుతాయి.ఫలితంగా మిణుకుమిణుకుమంటూ ఉంటాయి.

మంచు తెల్లగా యెందుకు ఉంటుంది?

చిన్న చిన్న పారదర్షక స్ఫటికాలతో రూపొందిన మంచుకు నిజానికి రంగు ఉండదు.గాలిలోని అణువులతో ఆవ్రుతమైన ఈ స్ఫటికాల ఉపరితలాల మీద వెలుగు కిరణాలు పరావర్తనం చెందటం వల్ల మంచుకు తెలుపు రంగు వస్తుంది.

మేఘాలు యే విధంగా యేర్పడతాయి?



సూర్య రశ్మి వలన , గాలి వలన, సముద్రాలు, చెరువులు ,సరస్సులు,కుంటలు,నదులు తదితర నీతివనరుల నుండి నీరు ఆవిరై వాతావరణం లోని యెత్తైన ప్రదేశాల్లోకి చేరుకొంటుంది.అక్కడ ఈ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవించి మేఘాలు యేర్పడతాయి.మేఘాల్లోని ఈ నీటి బిందువులు సంలీనత చెందినపుడు వర్షం పడుతుంది.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...