Saturday 27 May 2017

NEETIKI YE RANGU YENDUKUNDADU?/ నీటికి ఏ రంగూ ఎందుకుండదు?

ఏదైనా ఒక వస్తువు పసుపు రంగులో కనిపిస్తుంది అంటే దానర్థం అది తెల్లని కాంతిలోని అన్ని రంగులనూ శోషించుకుని ఒక పసుపు రంగుని మాత్రమే తిప్పి కొడుతుంది అని.అన్ని వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.ఇలా వస్తువుపై పడి పరావర్తనం చెంది వచ్చి మన కంటిని చేరే కాంతికిరణాల మూలంగానే మనం ఆ వస్తువును , దాని రంగును తెలుసుకోగలుగుతున్నాం.

పాల లాగా పూర్తిగా తెల్లగా ఉండే పదార్థాలు, బొగ్గులాగా పూర్తిగా నల్లగా ఉండే పదార్థాలు కాంతి విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తాయి.తెల్లని వస్తువులు అన్ని రకాల కాంతికిరణాలను తిప్పికొడితే , నల్లని వస్తువులు అన్ని కాంతికిరణాలను శోషింపచేసుకుంటాయి.అందువల్ల తెల్లని వస్తువులు తెల్లగా, నల్లని వస్తువులు నల్లగా కనిపిస్తాయి.{ నల్లని వస్తువుపై పడిన కాంతికిర్ణాల్లో కొన్నైనా తిరిగిరావడం వల్ల అది కనిపిస్తుంది , లేకపోతే అదికూడా ఉండదు.}

ఇక నీటి విషయానికి వస్తే ,అదికూడా తెల్లని వస్తువుల్లాగా,నల్లని వస్తువుల్లాగా కాంతికి సంబంధించిన విభిన్న కిరణాల విషయంలో ఎలాంటి భేదభావం చూపదు.

అంటే నీరు తనపై పడే కాంతిలోని అన్ని రంగులనూ సమానంగా శోషింపచేసుకుంటుంది,సమానంగా పరావర్తనం చెందిస్తుంది,అదే సమయంలో అన్ని రంగులనూ తనగుండా పోనిస్తుంది.సాధారణంగా నీటిపై పడిన కాంతిలో ఎక్కువ భాగం దానిగుండా ప్రయాణించి అంతర్థానమైపోతుంది.నీటికి ఉన్న ఇలాంటి ప్రత్యేక ధర్మాల వల్లనే అది ఏ రంగూ లేకుండా కంపిస్తుంది.
ఒకవేళ ఎక్కడైన ఏ నీరైనా ఏదైనా రంగులో ఉందంటే అది స్వచ్చమైన నీరు కాదని,లేదా దాని పరిసరాలలోని వివిధ అంశాల ప్రభావం దానిపై బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి.

ఆకలి ఎందుకు వేస్తుంది? / AKALI YENDUKU VESTHUNDHI?


మన శరీరం ఎప్పుడూ ఒక యంత్రంలా పని చేస్తుంది.అందుకొరకు ప్రతి అవయవానికి శక్తి కావాల్సి ఉంటుంది.ఆయా సందర్భాలను బట్టి,చేసే పనులను బట్టి మనకు కావలసిన శక్తిలో కొచెం హెచ్చుతగ్గులు చోటుచేసుకోవచ్చు.అది వేఅరే విషయం.మనకు కావలసిన శక్తి,తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది.ఈ శక్తిని,వేడి ,చలనం వంటి వేర్వేరు శక్తి రూపాల్లోనికి మార్చుకొని సరీరం ఉపయోగించుకుంటుంది.అందుకని శక్తి ఉత్పాదనకు అవసరమయ్యే ఆహారం ,నీరు కావాల్సి వచ్చినప్పుడల్లా సరీరం అందుకు తగిన సంకేతాలను మెదడుకు పంపుతుంది.మెదడుకు అందే ఈ సంకేతాలు,అలాగే వాటికి మెదడు స్పందించడంలో భాగంగా మనకు ఆకలి,దాహం తెలుస్తాయి.ఇంతకుముందు మనం తీసుకున్న ఆహారం ఖర్చయిపోయి కడుపు ఖాళీగా మారినప్పుడు ఆ విషయం నాడీమండలం ద్వారా మెదడుకు అందుతుంది.సరిగ్గా అలాంటి సమయాల్లోనే మనకు ఆకలిగా అనిపిస్తుంది.దానితో ఆ ఆకలిని తీర్చుకునేందుకు ఏదొ ఒకటి తిని శరీర శక్తి అవసరాలను తీర్చుకుంటాము.

Saturday 6 May 2017

పాలు ఎందుకు పొంగుతాయి? / PALU YENDUKU PONGUTHAYI?



పాలలో 85% నీరు ఉంటుంది.మిగతా 15%కొవ్వులు,మాంసకృత్తులు,చక్కెర,ఇంకా లవణాలు ఉంటాయి.పాలల్లో ఈ పదార్థాలన్నీ ఉన్నందున మామూలు నీరు మరిగే ఉష్ణోగ్రతకి,పాలు మరిగే ఉష్ణోగ్రతకి కొంత తేడా వస్తుంది.సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుందన్న సంగతి తెలుసు .పాలు మరిగే ఉష్ణోగ్రత దీనికన్నా ఓ అర డిగ్రీ ఎక్కువగా ఉంటుంది.ఐతే పాలు మరగడానికి కొంచెం ముందుగా అందులోని కొవ్వు,మాంస కృత్తుల్లో  కొంత భాగం పాల పై భాగంలో ఒక పలుచని పొరలాగా రూపొందుతుంది.పాలు మరిగే ఉష్ణోగ్రతకి చేరి అందులోంచి నీటి ఆవిరి బయటకు రావడం మొదలుపెట్టినప్పుడు ఈ మీగడ పొర దానికి అడ్డుగా నిలుస్తుంది.ఐతే నీటి ఆవిరి ఊర్ధ్వ ముఖంగా కలిగించే ఒత్తిడి మూలంగా ఈ మీగడ పొర తప్పనిసరై గిన్నెలో పైకి లేస్తుంది.కాని ఆవిరి కలిగించే ఒత్తిడి కారణంగా ఇందులో పలు పగుళ్లు వస్తాయి.పాలలో ఉండే కొవ్వు ,మాంస కృత్తుల సాయంతో ఆ పగుళ్లు క్షణాలలో పూడి, మళ్లీ కొత్త పొర రూపొందుతుంది.దాంతో  నీటి ఆవిరి ఆ పొరను మళ్ళీ పైకి ఎగదన్నుతుంది.సరిగ్గా ఈ ప్రక్రియనే మనం పాలు పొంగడం అని అంటున్నాం.నీటి ఆవిరితో పైకి లేచిన మీగడ పొర మళ్ళీ పగలడం,తిరిగి మీగడ పొర కొత్తగా ఏర్పడడం అనే ప్రక్రియ కొన్ని నిమిషాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.ఒక్కోసారి ఇందులో భాగంగా పాలు బాగా పొంగి గిన్నె బయటకు కూడా వస్తుంది.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...