Saturday, 27 May 2017

NEETIKI YE RANGU YENDUKUNDADU?/ నీటికి ఏ రంగూ ఎందుకుండదు?

ఏదైనా ఒక వస్తువు పసుపు రంగులో కనిపిస్తుంది అంటే దానర్థం అది తెల్లని కాంతిలోని అన్ని రంగులనూ శోషించుకుని ఒక పసుపు రంగుని మాత్రమే తిప్పి కొడుతుంది అని.అన్ని వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.ఇలా వస్తువుపై పడి పరావర్తనం చెంది వచ్చి మన కంటిని చేరే కాంతికిరణాల మూలంగానే మనం ఆ వస్తువును , దాని రంగును తెలుసుకోగలుగుతున్నాం.

పాల లాగా పూర్తిగా తెల్లగా ఉండే పదార్థాలు, బొగ్గులాగా పూర్తిగా నల్లగా ఉండే పదార్థాలు కాంతి విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తాయి.తెల్లని వస్తువులు అన్ని రకాల కాంతికిరణాలను తిప్పికొడితే , నల్లని వస్తువులు అన్ని కాంతికిరణాలను శోషింపచేసుకుంటాయి.అందువల్ల తెల్లని వస్తువులు తెల్లగా, నల్లని వస్తువులు నల్లగా కనిపిస్తాయి.{ నల్లని వస్తువుపై పడిన కాంతికిర్ణాల్లో కొన్నైనా తిరిగిరావడం వల్ల అది కనిపిస్తుంది , లేకపోతే అదికూడా ఉండదు.}

ఇక నీటి విషయానికి వస్తే ,అదికూడా తెల్లని వస్తువుల్లాగా,నల్లని వస్తువుల్లాగా కాంతికి సంబంధించిన విభిన్న కిరణాల విషయంలో ఎలాంటి భేదభావం చూపదు.

అంటే నీరు తనపై పడే కాంతిలోని అన్ని రంగులనూ సమానంగా శోషింపచేసుకుంటుంది,సమానంగా పరావర్తనం చెందిస్తుంది,అదే సమయంలో అన్ని రంగులనూ తనగుండా పోనిస్తుంది.సాధారణంగా నీటిపై పడిన కాంతిలో ఎక్కువ భాగం దానిగుండా ప్రయాణించి అంతర్థానమైపోతుంది.నీటికి ఉన్న ఇలాంటి ప్రత్యేక ధర్మాల వల్లనే అది ఏ రంగూ లేకుండా కంపిస్తుంది.
ఒకవేళ ఎక్కడైన ఏ నీరైనా ఏదైనా రంగులో ఉందంటే అది స్వచ్చమైన నీరు కాదని,లేదా దాని పరిసరాలలోని వివిధ అంశాల ప్రభావం దానిపై బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...