Sunday, 4 June 2017

ఈతగాళ్ళు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? / EETHAGALLU PRATHYEKAMAINA KALLADDHALU YENDHUKU PETTUKUNTARU?


కాంతికిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక నిర్దిష్టకోణంలోనికి వంగుతాయి.ఇంకోలా చెప్పాలంటే అలాంటి సందర్భాలలో వాటి ప్రయాణమార్గంలో మార్పు వస్తుంది.దీనినే వక్రీభవనం అంటారు.వస్తువు నుంచి పరావర్తనం చెంది బయలుదేరే కాంతి ముందుగా గాలిలోనూ ,ఆ తరువాత మన కంటి పైభాగంలోనూ రెండు సార్లు వక్రీభవనానికి గురై ,చివరకు రెటీనాపై పడుతుంది.ఆ విధంగా మనకు ఒక వస్తువు లేదా దృశ్యం కనిపిస్తుంది.కాని ఒక వేల గాలి వక్రీభవనగుణకం ,మన కంటి వక్రీభవన గుణకం ఒకేవిధంగా ఉన్నట్లైతే ఆయా వస్తువులను చూడడం మనకు చాలా కష్టమౌతుంది.దానికి భిన్నంగా నీటి వక్రీభవన గుణకం ,మన కంటి వక్రీభవన గుణకం దాదాపుగా ఒకేలా ( 1.34 ) ఉంటాయి.ఇలా రెండు యానకాల వక్రీభవన గుణకాలు సమానంగా ఉన్నప్పుడు ,ఒక యానకం నుండి మరొక యానకంలోనికి కాంతి దూసుకుపోయినప్పుడు గమన మార్గంలో ఎటువంటి మార్పు రాక అది సూటిగా దూసుకు పోతుంది.అలాంటి సమయాల్లో వస్తువులను చూడడం మనకు కష్టమౌతుంది.నీటిలో ఉన్నప్పుడు ఈ కారణంగానే మనకు వివిధ వస్తువులు ,జలచరాలు స్పష్టంగా కాకుండా అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి.ఇలా జరగకుండా ఉండడం కోసమే సముద్రంలో ఈదే వాళ్లు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరిస్తారు.ఈ కళ్ళద్దాలలో గాజుపలకల మధ్య గాలి నిండి ఉంటుంది.నీటిలోంచి వచ్చిన కిరణాలు గాలిలోనికి ప్రవేశించి , ఆ తర్వాతే కళ్ళలోకి వస్తాయి.దాంతో అవి వేర్వేరు వక్రీభవనాలకు గురై చివరకు ఆ వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...