Saturday, 29 December 2018

కెమెరా ఫ్లాష్ లైట్ ఎలా పని చేస్తుంది?


వెలుతురు సరిగా లేనప్పుడు చీకటిలో ఫోటోలు తీయవలసి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు కెమెరాలో ఫ్లాష్ లైట్ ను ఉపయోగిస్తారు.ఆధునికంగా తయారైన ఫ్లాష్ గన్ లోని క్జెనాన్ ఫ్లాష్ లాంప్ ద్వారా కనంతి వెలువడుతుంది.ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ లు ,విద్యుత్ శక్తి సాయంతో పని చేస్తుంది.డ్రై బ్యాటరీ ద్వారా దీనికి విద్యుత్ లభిస్తుంది.ఆల్టర్నేట్ కరెంట్ ను కూడా లైటు వెలిగించడానికి ఉపయోగించవచ్చు.ఫ్లాష్ లైటు విద్యుత్ ను కాంతి శక్తిగా మారుస్తుంది.ఫ్లాష్ లాంప్ ఒక గాజు నాళిక.సాధారణంగా ఇది 2 అంగుళాల పొడవు ,పావు అంగుళం వ్యాసం కలిగి ఉంటుంది.నాళికలో 2 కొసలలోనూ 2 టంగ్ స్టన్ ఎలక్ట్రోడులను అమరుస్తారు.నాళికలో గాలిని తీసేసి 400-500 మిల్లి మీటర్ల ఒత్తిడి గల క్జెనాన్ వాయువును నింపుతారు.నాళిక చుట్టూ సన్నని తీగను చుడతారు.ఇది 3 వ ఎలక్ట్రోడుగా పని చేస్తుంది.దీనినే ట్రిగ్గర్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటారు.

లాంప్ లోని 2 ఎలక్ట్రోడులను ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు కలుపుతారు.షట్టర్ న్య్ నొక్కగానే ఎలక్ట్రిక్ మీట ఆన్ అవుతుంది.ఈ సమయంలో కెపాసిటర్లో నిల్వ ఉన్న విద్యుత్ క్జెనాన్ లాంప్ ద్వారా వెలువడుతుంది.ఫలితంగా కాంతి వెలువడి ఫోటో తీయవలసిన వస్తువు లేదా మనిషి మీద పడుతుంది.

Thursday, 27 December 2018

బొగ్గు మండుతున్న గదిలో తలుపు మూసుకుని నిద్రించడం ప్రమాదకరం. ఎందుకు ?

బొగ్గు మండుతున్న గదిలో తలుపు మూసుకుని నిద్రించడం చాలా ప్రమాదకరం.
ఎందుకంటే మండుతున్న బొగ్గు కార్బన్ డై ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇది విషపూరితమైన వాయువు.ఈ వాయువు బయటికి పోవడానికి మార్గం లేకపోతే అది గదంతా నిండిపోయి ,గదిలో ఉన్నవారికి శ్వాస ఆడకుండా చేస్తుంది.అందువల్ల అలా నిద్రించడం ప్రాణాలకే ప్రమాదం.

ఎర్నెస్ట్ హెమింగ్వే - అమెరికా రచయిత./ ERNEST HEMINGWAY - AMERICAN WRITER.

అమెరికన్ సాహిత్య చరిత్రలో కొత్త శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్ హెమింగ్వే చికాగో సమీపంలో జన్మించాడు.తండ్రి ప్రముఖ డాక్టరు,క్రీడాకారుడు.1917 లో కాన్సాస్ సిటీ స్టార్ పత్రికలో రిపోర్టర్ గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు.మరుసటి సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసాడు.క్షతగాత్రుడై అమెరిచా తిరిగి వచ్చి టొరంటో స్టార్ అనే వారపత్రికలో ఫీచర్లు రాశాడు.మరికొన్నాళ్లకు ఫారిన్ కరస్పాండెంట్ గా యూరోప్ వచ్చి పారిస్ లో స్థిరపడ్డాడు.1922 లో గ్రీసు,టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్ చేసాడు.మరుసటి సంవత్సరం తొలి పుస్తకం త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయంస్ వెలువడింది.ఆ తరువాతి జీవితమంతా బుల్ ఫైటింగ్,ఆఫ్రికా అడవుల్లో వేట,సముద్రం మీద ఫిషింగ్ లో గడిచింది.స్పానిష్ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు.క్యూబాలో చాలా కాలం గడిపాడు.1961 లో ఆత్మహత్య చేసుకున్నాడు.కథా రచన గురించి ,ముఖ్యంగా శైలి ,వాక్య నిర్మాణం గురించి ఆయన చాలా కృషి చేసాడు.తొలి కథలు ఇన్ అవర్ టైం ( 1925 ) ,ఎ ఫేర్ వెల్ టు ఆర్మ్ స్ ( 1929 ) తో ఒక గొప్ప స్టైలిష్ట్ గా సాహితీ లోకం అతణ్ణి గుర్తించింది.20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లీష్ సాహిత్య శైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేరు.( చైతన్య స్రవంతితో జేంస్ జాయిస్ కూడా ధ్రువ తారగా అవతరించారు ,కాని అది వేరు. )1940 నాటి ఫర్ హూం ది బెల్ టోల్స్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ.1932 లో బుల్ ఫైటింగ్ గురించి డెత్ ఇన్ ద ఆఫ్టర్ నూన్,1935 లో వేట గురించి గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా రాశాడు.సముద్రంలో చేపల వేట గురించి అద్భుత తాత్విక నవల ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ ( 1952 ) తర్వాత 1954 లో హెమింగ్వే ను నోబెల్ బహుమతి వరించింది.
పాఠకుడు మరెంత ఉందో కథ అనుకోవడమే రచయిత ప్రతిభకు గీటురాయి అంటాడు హెమింగ్వే తన శైలి గురించి.కథా వస్తువు కోసం ,ఉద్వేగ భరిత సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు.

Monday, 24 December 2018

సాధారణ థర్మా మీటర్ ,క్లినికల్ థర్మా మీటర్ల మధ్య తేడా ఏమిటి?


సాధారణంగా థర్మా మీటర్ అనగానే మనకు ఆసుపత్రిలో మనకు పరీక్ష చేసే పరికరం గుర్తుకు వస్తుంది.ఈ క్లినికల్ థర్మా మీటర్ లో బల్బ్ దగ్గర ఒక నొక్కు ఉంటుంది.అందువల్ల గొట్టంలో ఒక స్థాయికి పెరిగిన పాదరసం విదిలించనిదే కిందికి దిగదు.ఆ విధంగా అది ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుంది.సాధారణ థర్మా మీటర్ లో ఈ ఏర్పాటు ఉండదు.

Saturday, 22 December 2018

ఓటింగ్ శాతం తగ్గితే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందా?


ఓటింగ్ శాతం పెరిగినా,తగ్గినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.40% పోలింగ్ జరిగే నియోజక వర్గాలు కొన్ని ఉంటే ,90% జరిగేవి మరికొన్ని ఉంటాయి.ఐనా అన్నింటిలో ఓటింగ్ సరళి ఒకేలా ఉంటుంది.కేవలం ఒక్క శాతం ఓటర్లను ప్రశ్నించి చేసే సర్వేల్లోనే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోతోంది.అలాంటప్పుడు పోలింగ్ శాతంలో తేడా ఫలితాన్ని మార్చుతుందని అనుకోలేము.

ఎన్నికల పట్ల ప్రజలలో ఆసక్తి లేనప్పుడు ,ఏదైనా పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకెళ్ళవచ్చు.ఐతే వారు ఆ పార్టీకే ఓటు వేస్తారని అనుకోవడం పొరబాటు అవుతుంది.ఐదేళ్ళ పరిశీలన ద్వారా తీసుకున్న నిర్ణయం కేవలం ఒక్క అనుభవంతో మారిపోదు.

Monday, 17 December 2018

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?


ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ ' అంటారు.ఈ పరిజ్ఞానం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి.విమాన పైలట్లకు శిక్షణనివ్వడంలో అవసరమైన సిమ్యులేషన్ ప్రక్రియలలో దీనిని వాడుతున్నారు.ఇంజనీర్లు,ఆర్కిటెక్ట్ లు ,భవన నిర్మాణ ప్రక్రియలు ప్రారంభం కాకముందే భవనాలు ఎలా ఉంటాయో చూపడానికి ,వీడియో,కంప్యూటర్ గేంస్ లోనూ ఈ పరిజ్ఞానం తోడ్పడుతోంది.అమెరికాలోని మానసిక వైద్యులు ఎత్తైన ప్రదేశాలపై గల మానసిక భయాలను ఈ పద్ధతి ద్వారా సృష్టించే గ్లాస్ ఎలివేటర్ల ద్వారా తొలగిస్తున్నారు.

Saturday, 15 December 2018

ఈత కొలను దాని అసలు లోతుకంటే తక్కువ లోతుగా ఉన్నట్లు ఎందుకు కనిపిస్తుంది?


కాంతి కిరణాలు ,కొలను అడుగునుండి బయలుదేరి నీటిగుండా గాలిలోకి ప్రయాణించేప్పుడు ,సాంద్రతమ యానకం నుంచి విరళతమ యానకం లోకి ప్రయాణిస్తాయి.కాబట్టి అవి వక్రీభవనం చెందుతాయి. ఫలితంగా కొలను అడుగు భాగానికి చెందిన అసలు ప్రతిబింబం ,అడుగు భాగానికి పైన ఏర్పడుతుంది.కావున ఈత కొలను లోతు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఎక్కువ జ్వరంతో ఉన్న వ్యక్తి నుదుటి మీద ఆల్కహాల్ తో కలిపిన నీటిని ఎందుకు అద్దుతారు?


భాష్పీభవనం వల్ల చల్లదనం ఏర్పడుతుంది.అధిక భాష్పశీలి అయిన అల్కహాల్ చాలా త్వరగా భాష్పీభవనం చెందుతుంది.తద్వరా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.అందుకే అల్కహాల్ తో కలిసిన నీటిని అద్దుతారు.

Friday, 14 December 2018

ఫాస్ఫరస్ ను నీళ్లలో ఉంచుతారు.ఎందుకు?


ఫాస్ఫరస్ గాలిలో మండుతుంది.గది ఉష్ణోగ్రతలో కూడా ఇది అంటుకుంటుంది.అందువల్ల దీనిని ఎప్పుడూ నీళ్లలో ఉంచుతారు.పైగా ఇది నీళ్లలో కరగదు.

నీటి మీద తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి?/ PUMICE STONES

నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.ఫ్యుమైస్ స్టొన్స్ గా వ్యవహరించే ఈ రాళ్లు ఏళ్ల తరబడి నీటిపై తేలడం వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది చాలా కాలం వరకు అంతుబట్టలేదు.ఈ చిక్కుముడిని విప్పడానికి లారెన్స్ బెర్క్ లీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.వారి పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.ఎక్ష్ రే ల సహాయంతో రాళ్లను పరీక్షించగా మన చర్మంపై ఉన్న రోమాల తరహాలో ఈ రాళ్లపై సూక్ష్మ స్థాయిలో రంధ్రాలు ఉన్నాయని తేలింది.వీటితో పాటు రాళ్లలో రకరకాల వాయువులు ఉన్నట్లు గుర్తించారు.అంతర్భాగంలో చిక్కుకుపోయిన ఈ వాయువుల కారణంగానే ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని నిర్ధారణకు వచ్చారు.

Thursday, 13 December 2018

తాగే నీటిలో ఫ్లోరైడ్ ను ఎందుకు కలుపుతారు?



ఫ్లోరిన్ లేదా మరింత ఖచ్చితంగా చెప్పాలంటే సోడియం ఫ్లోరీడ్ ఉన్న తాగునీరు ,దంతాల సమస్యను నివారించడంలో తోడ్పడుతుందని విశ్వసించడమైనది.దంతాల మీద ఆంలాలను ఏర్పరిచే సమస్యలో సోడియం ఫ్లోరైడ్ జోక్యం చేసుకుంటుంది.ఈ నోటి ఆంలాలను దంతాలు తట్టుకునేలా చేయడంలో కూడా ఇది తోడ్పడుతుంది.ఐతే మరీ ఎక్కువ ఫ్లోరైడ్ దంతాలకు హాని కలిగిస్తుందని ఈ సందర్భంగా గమనించవలసి ఉంటుంది.

దీపం వత్తి ద్వారా చమురు / నూనె ఏ విధంగా పైకి వస్తుంది?


వత్తిలోని తంతువుల మధ్య గాలి దూరే స్థలం ఉండటం వల్ల వత్తిలో చాలా సన్నని రంధ్రాలు గల అసంఖ్యాకమైన కేశికలు ఉంటాయని పరిగణించడమైనది.ఈ వత్తికి చెందిన ఒక భాగాన్ని చమురులో ముంచినప్పుడు కేశిక చర్య కారణంగా చమురు వత్తి పై భాగానికి ప్రసారమౌతుంది.

బెలూన్ లు గాలిలో ఎగరడానికి ఏ నియమం వర్తిస్తుంది?


గాలితో నింపిన బెలూన్ ఎక్కువ ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది.అందువల్ల దాని బరువు కంటే ఎక్కువైన వాయు ఊర్ధ్వాభిబలం దానికి సమకూరుతుంది.ఈ ఊర్ధ్వాభిబలం వల్ల ,ప్లవన నియమం ప్రకారం బెలూన్ గాలిలో ఎగురుతుంది.

Wednesday, 12 December 2018

గాలి నింపిన బెలూన్ పైకి ఎగురుతూ ఒక నిర్ణీతమైన ఎత్తులో నిలిచిపోతుంది. ఎందుకు ?


మనం వాతావరణంలో పైకి పోయే కొద్దీ ,వాతావరణ సాంద్రత తగ్గిపోతుంది.పైకి ఎగురుతున్న బెలూన్ లోని వాయు సాంద్రత,గాలి సాంద్రతకంటే తక్కువగా ఉన్నంతవరకు మాత్రమే అది పైకి పోతుంది.వాతావరణ సాంద్రత బెలూన్ లోని వాయుసాంద్రతతో సమానమైన ఎత్తుకు చేరిన క్షణం ,బెలూన్ పైకి పోవడం ఆగిపోయి అక్కడే నిలిచిపోతుంది.

Tuesday, 11 December 2018

విమానానికి ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి జాగ్రత్తగా కిందికి దిగడంలో ప్యారాచూట్ ఎలా సహకరిస్తుంది?


ప్యారాచూట్ కోటరంలో తగినంత గాలి ఉంటుంది.కిందికి దిగేటప్పుడు ప్యారాచూట్ అకస్మాత్తుగా కిందికి పడిపోకుండా ఉండటానికి ఈ కోటరంలోని గాలి దాన్ని పైకి లేపుతూ ఉంటుంది.అందువల్ల ప్యారాచూట్ నెమ్మదిగా కిందికి దిగుతుంది.

వాహనాన్ని ఎత్తైన ప్రదేశానికి ఎక్కిస్తున్నప్పుడు మామూలుగా డ్రైవర్ వేగం పెంచుతాడు.ఎందుకు?


వాహనాన్ని ఎత్తైన ప్రదేశాలపై నడుపుతున్నప్పుడు గురుత్వబలం వాహనాన్ని ఆకర్షిస్తుంది. ఈ గురుత్వ బలాన్ని అధిగమించడానికి డ్రైవర్ వాహన వేగం పెంచుతాడు.

Sunday, 9 December 2018

సాధారణంగా వంట పాత్రలను అల్యూమినియంతో చేస్తారు.ఎందుకు?


అల్యూమినియం మంచి ఉష్ణవాహకం.దీని నిర్దిష్ట ఉష్ణం కూడా బాగా ఎక్కువే.అందువల్ల మిగిలిన లోహాల కంటే ఇది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది.పైగా ఇది అంత ఖరీదైన లోహం కూడా కాదు.అందువల్ల వంటపాత్రలను సాధారణంగా అల్యూమినియంతో చేస్తారు.

సిరాతో నింపిన ఫౌంటేన్ పెన్నులను విమానాల్లో తీసుకొనిపోవడానికి అనుమతించరు.ఎందుకు?


సముద్రమట్టంతో పోలిస్తే ఉన్నతప్రదేశాల్లో వాయు వాతావరణపీడనం అధికంగా ఉంటుంది.ఎత్తైన ప్రదేశాల్లో పెన్నులోని గాలి వ్యాకోచిస్తుంది.అందువల్ల పెన్నులోని ఇంకు బయటకు వస్తుంది.

Saturday, 8 December 2018

బల్బు పగిలినప్పుడు ఎందుకు శబ్దం వస్తుంది.?


బల్బు లోపల శూన్యం ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే .బల్బు పగిలినప్పుడు అందులోని శూన్యాన్ని భర్తీ చేయడానికి అన్ని వైపులనుండి గాలి ఎక్కువ వేగంతో బల్బులోకి ప్రవేశిస్తుంది.అందువల్ల శబ్దం వస్తుంది.

మైదానాల్లో వర్షిస్తున్నప్పుడు ఎత్తయిన కొండలమీద పొగమంచు కనిపిస్తుంది.ఎందుకు?


ఎత్తైన ప్రదేశాల్లోని వాతావరణ ఉష్ణోగ్రత సాధారణంగా నీటి ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంటుంది.అందువల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న నీటి ఆవిరులు ,మంచుగా మార్పు చెందుతాయి.

Friday, 7 December 2018

కరెంటును మందమైన రాగి తీగల ద్వారా ఎందుకు ప్రసారం చేస్తారు.


విద్యుత్ వాహక నిరోధం తీగ అడ్డు కోతతో విలోమంగా ఉంటుంది. మందమైన తీగలకు తక్కువ నిరోధం ఉంటుంది.రాగి ఉత్తమ విద్యుత్ వాహకాలో ఒకటి,కావున విద్యుత్ సరఫరాకు రాగిని వాడటం జరుగుతుంది.

మంచులో ఉష్ణం ఉంటుందా?



మంచులో ఉష్ణం ఉంటుంది.మంచు ఉష్ణోగ్రత 6 దిగ్రీలు ఐతే మంచు కరుగుతున్నపుడు అది ఉష్ణాన్ని శోషణం చేసుకుంటుంది.ఈ ఉష్ణాన్నే గుప్తోష్ణం అంటారు.ఇది 80 కెలొరీలు / గ్రాం కు సమానం.ఈ ఉష్ణం వల్లనే మంచు అత్యంత చల్లగా ఉండదు.

హిమ బిందువు ఎందుకు గుండ్రంగా ఉంటుంది.


హిమబిందువులోని ప్రతిభాగమూ దాని కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటుంది.అందుకే హిమబిందువు గుండ్రంగా ఉంటుంది.

ఒక్క ఓటు తేడాతో జరిగిన ప్రముఖ సంఘటనలు / ఒక్క ఓటు విలువ తెలిపిన సంఘటనలు.



1 . 1999 లో కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం 1 ఓటు తేడాతోనే కూలిపోయింది.

2 . 1 ఓటు తేడాతో ఆంగ్లం / ఇంగ్లీషు పై గెలిచి హిందీ మన దేశ అధికార భాషగా గుర్తింపు పొందింది.

3 . 2004 లో కర్ణాటకలోని సంతెమరహళ్లి నియోజక వర్గం నుండి జేడిఎస్ అభ్యర్థి  ఎ.ఆర్ . కృష్ణమూర్తి 1 ఓటు తేడాతో  ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.

4 . 1776 లో 1 ఓటు తేడాతో అమెరికాలో జర్మన్ కు బదులుగా ఇంగ్లీష్ అధికార భాషగా మారింది.

5 . 1714 లో 1 ఓటు తేడాతో కింగ్ జార్జ్ 1 ఇంగ్లండ్ పీఠమెక్కారు.

6 . 1800 లో థామస్ జెఫర్సన్ , 1824 లో జాన్ క్వీన్స్ ఆడంస్ ,1876 లో రూథర్ఫర్డ్ హెంస్ లు ఎలక్టోరల్ కాలేజిలో 1 ఓటు తేడాతో అమెరికా అధ్యక్ష పదవులు చేఫట్టారు.

7 . 1923 నవంబర్ 8 న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 1 ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ తన ప్రత్యర్థిపై గెలిచారు.

8 . 2008 ఎన్నికల్లో రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సిపి జోషి 1 ఓటు తేడా తో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.కాంగ్రెస్ ను ముందుండి నడిపించిన ఆయన భాజపా అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఓడిపోయారు.చౌహాన్ కు 62,216 ఓట్లు రాగా జోషికి 62,215 ఓట్లు వచ్చాయి.ఒక్క ఓటే ఆయన భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. గెలిస్తే ఆయనే సిఎం అయ్యేవారు. నిజానికి ఆ ఎన్నికల్లో జోషి తల్లి,భార్య, కారు ద్రైవరు ఈ ముగ్గురూ ఓటు వేయలేదు. పైపెచ్చు తన ద్రైవర్ ను జోషియే ఓటేయకుండా ఆపారట వాళ్ళ మూడు ఓట్లు పడి ఉంటే ఆయనే సిఎం అయ్యేవారు.ఒక్క ఓటు విలువ ఎంతఒ చెప్పడానికి చక్కని ఉదాహరణ ఇది.

Wednesday, 5 December 2018

మోటారు కారు ముందు చక్రాలు సాధారణంగా కొంచెం పక్కకు వంగి ఉంటాయి.ఎందుకు?


కోణాలలోని తేడాను సరిచేసుకోవడానికీ, మలుపులు తిరుగుతున్నప్పుడు కారుకు అధిక స్థిరత్వం ఇవ్వడానికీ ముందు చక్రాలు కొంచెం బయటి వైపుకు వంగి ఉంటాయి.

విద్యుత్ బల్బు లోపలి నుండి గాలిని ఎందుకు తీసేస్తారు ?


గాలి సమక్షంలో తంగ్స్టన్ వేడెక్కినప్పుడు , అది గాలిలోని ఆక్సిజంతో సమ్యోగం చెంది దాని ఆక్సైడ్ ను ఏర్పరుస్తుంది.ఫలితంగా వెంటనే ఫ్యూజ్ పోతుంది.దీనిని నివారించడానికి విద్యుత్ బల్బ్ లోపలి నుండి గాలిని తీసేస్తారు.

కనిష్ట ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమ లోహం ఏది?

కనిష్ట ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమ లోహం ఏది?

కనిష్ట ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమ లోహం సోల్డర్. అందుకే దీనిని సోల్డరింగ్ కు వాడతారు.

పగటి వెలుతురులో నూనె లేదా సబ్బు పొరను చూసినప్పుడు రంగుల్లో కనిపిస్తుంది.ఎందుకు ?

పగటి వెలుతురులో నూనె లేదా సబ్బు పొరను చూసినప్పుడు రంగుల్లో కనిపిస్తుంది.ఎందుకు ?

కాంతి వ్యతికరణం కారణంగా పగటి వెలుతురులో నూనె లేదా సబ్బు పొరను చూసినప్పుడు అది రంగుల్లో కనిపిస్తుంది.

Tuesday, 4 December 2018

ఒకే రూపంలో ఉన్న కవలల వేలి ముద్రలు కూడా ఒకే విధంగా ఉంటాయా?

ఒకే రూపంలో ఉన్న కవలల వేలి ముద్రలు కూడా ఒకే విధంగా ఉంటాయా?

ఇద్దరు వ్యక్తులు కవలలైనా సరే ,వేలి ముద్రలు మాత్రం ఎప్పుడూ పరస్పరం జత కుదరవు

మన రోజువారీ ఆహారంలో కొంత మోతాదు కాల్షియం తీసుకోవడం అవసరం . ఎందుకు?


మన ఎముకలూ , దంతాల పెరుగుదలకుఒ ,పోషణకూ కాల్షియం ఎంతైనా అవసరం. గుండె ,కండరాల కార్య కలాపాలకు కూడా కాల్షియం అవసరమవుతుంది..మనం రోజూ సగటున 1 గ్రాము కాల్షియం తీసుకోవలసి ఉంటుంది.పాలు,కూరగాయలు , చిరుధాన్యాలు మొదలైన వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

నీటిని శూన్యంలో ఉంచినట్లైతే గది ఉష్ణోగ్రతలో నీరు మరుగుతుంది. మరగడంతో పాటు చల్లబడుతుంది.ఎందుకు?


ద్రవ పదార్థ పీడనం తగ్గినప్పుడు ,మరిగే ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.సాధారణ పీడనంలో నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడుల దగ్గర మరుగుతుంది.ఐతే శూన్యంలో ఉంచినప్పుడు ,గది ఉష్ణోగ్రత దగ్గరే మరుగుతుంది.మరగడంతో పాటు చల్లబడుతుంది

Monday, 3 December 2018

గాలి కొట్టేటప్పుడు సైకిల్ పంపు వేడెక్కుతుంది ఎందుకు ?



గాలి కొట్టేటప్పుడు పంపును వెంటవెంటనే కదిలించడం వల్ల గాలి అకస్మాత్తుగా సంపీడనం చెందుతుంది.ఫలితంగా ఉష్ణం ఉత్పత్తి అవుతుంది.ఈ ఉష్ణం తగ్గడానీ చాలినంత విరామం పంపు కదలికల మధ్య ఉండదు. అందుకే పంపు వేడెక్కుతుంది.

Saturday, 1 December 2018

ఒక వ్యక్తి భూమిపై చాలా తక్కువ పీడనాన్ని ఎప్పుడు కలుగ చేస్తాడు?


భూమి మీద పడుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి చాలా తక్కువ పీడనాన్ని భూమి పై కలిగిస్తాడు.ఎందుకంటే ఆ సమయంలో అతను నిలబడినప్పటికంటే ,కూర్చున్నప్పుడు,కూర్చున్నప్పటికంటే  పడుకున్నప్పుడు ఎక్కువ విస్తీర్ణం ఆక్రమిస్తాడు,అందుకే భూమి మీద పీడనం తక్కువగా ఉంటుంది.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...