అమెరికన్ సాహిత్య చరిత్రలో కొత్త శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్ హెమింగ్వే చికాగో సమీపంలో జన్మించాడు.తండ్రి ప్రముఖ డాక్టరు,క్రీడాకారుడు.1917 లో కాన్సాస్ సిటీ స్టార్ పత్రికలో రిపోర్టర్ గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు.మరుసటి సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసాడు.క్షతగాత్రుడై అమెరిచా తిరిగి వచ్చి టొరంటో స్టార్ అనే వారపత్రికలో ఫీచర్లు రాశాడు.మరికొన్నాళ్లకు ఫారిన్ కరస్పాండెంట్ గా యూరోప్ వచ్చి పారిస్ లో స్థిరపడ్డాడు.1922 లో గ్రీసు,టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్ చేసాడు.మరుసటి సంవత్సరం తొలి పుస్తకం త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయంస్ వెలువడింది.ఆ తరువాతి జీవితమంతా బుల్ ఫైటింగ్,ఆఫ్రికా అడవుల్లో వేట,సముద్రం మీద ఫిషింగ్ లో గడిచింది.స్పానిష్ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు.క్యూబాలో చాలా కాలం గడిపాడు.1961 లో ఆత్మహత్య చేసుకున్నాడు.కథా రచన గురించి ,ముఖ్యంగా శైలి ,వాక్య నిర్మాణం గురించి ఆయన చాలా కృషి చేసాడు.తొలి కథలు ఇన్ అవర్ టైం ( 1925 ) ,ఎ ఫేర్ వెల్ టు ఆర్మ్ స్ ( 1929 ) తో ఒక గొప్ప స్టైలిష్ట్ గా సాహితీ లోకం అతణ్ణి గుర్తించింది.20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లీష్ సాహిత్య శైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేరు.( చైతన్య స్రవంతితో జేంస్ జాయిస్ కూడా ధ్రువ తారగా అవతరించారు ,కాని అది వేరు. )1940 నాటి ఫర్ హూం ది బెల్ టోల్స్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ.1932 లో బుల్ ఫైటింగ్ గురించి డెత్ ఇన్ ద ఆఫ్టర్ నూన్,1935 లో వేట గురించి గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా రాశాడు.సముద్రంలో చేపల వేట గురించి అద్భుత తాత్విక నవల ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ ( 1952 ) తర్వాత 1954 లో హెమింగ్వే ను నోబెల్ బహుమతి వరించింది.
పాఠకుడు మరెంత ఉందో కథ అనుకోవడమే రచయిత ప్రతిభకు గీటురాయి అంటాడు హెమింగ్వే తన శైలి గురించి.కథా వస్తువు కోసం ,ఉద్వేగ భరిత సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు.
Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అ...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
No comments:
Post a Comment