Tuesday, 6 June 2017
అంతరిక్షంలో కూడా విద్యుత్ ను పుట్టించవచ్చా? / ANTHARIKSHAM LO KOODA VIDYUTH NU PUTTINCHAVACHA?
భూవాతావరణాన్ని దాటాక సౌరశక్తి చాలా తీవ్రంగా ఉంటుంది.నేలను తాకే సూర్య రశ్మికన్నా భూవాతావరణాన్ని దాటాక లభించే సూర్యరశ్మి సుమారు 5 రెట్లు శక్తివంతంగా ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.దాంతో అంతరిక్షంలోనే సౌరవిద్యుత్తును తయారు చేసి దానిని ఏదో ఒక రూపంలో భూమికి తీసుకురాగలిగినట్లైతే విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.ఈ విషయంలో జపాన్ శాస్త్రజ్ఞులు మరో అడుగు ముందుకు వేసి రోదసిలో ఓ స్పేస్ సోలార్ పవర్ సిస్టం అనే ఒక మంచి ప్రాజెక్టును ప్రారంభించారు.దీనిలో భాగంగా భూవాతావరణం దాటాక,భూస్థిరకక్ష్యలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద, అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ' ఫొటో ఓల్టాయిక్ డిష్ లను ఏర్పాటు చేస్తారు.ఆ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలలాగే ఈ డిష్ లు కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతో సమానంగా తిరుగుతూ,నేలపై నుంచి ఎప్పుడు చూసినా ఒకే ప్రదేశం వద్ద ఉన్నట్లు కనిపిస్తాయి.అంతరిక్షంలోని ఈ డిష్ లు అపరిమితంగా లభించే సౌరశక్తిని గ్రహించి,దానిని లేజర్ కిరణాల రూపంలో గాని,సూక్ష్మ తరంగాల రూపంలో గాని నేలకు పంపిస్తాయి.వీటి ద్వారా భూమిపై పెద్దమొత్తంలో విద్యుత్ ను పుట్టించి,వాడుకునేందుకు వీలవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.ఇది విజయవంతమైతే మిగతా దేశాలు కూడా ఇలాంటి వినూత్న పద్ధతులకు సన్నద్ధం కావచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అ...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
No comments:
Post a Comment