Thursday, 29 June 2017
భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS
ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.
లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.
ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )
ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.
జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.
Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అ...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
No comments:
Post a Comment