Thursday, 10 December 2020

SURYUNI VEDIMI YENTHA? / సూర్యుని వేడిమి ఎంత?

 సూర్యుని వేడిమి ఎంత?

సూర్యగోళం ఉపరితలం ఉష్ణోగ్రత 11000 డిగ్రీల పారన్ హీట్. భూగోళం

వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, నీటి ఆవిరి ప్రసరిస్తూ ఉన్నట్లే సూర్య గోళం

వాతావరణంలో ఇనుము, సీసం, తగరం, రాగి, వెండి, తుత్తునాగం వంటి గట్టి లోహాలు

అన్నీ ద్రవరూపంలో కరిగి ఉడికి, ఆవిరిగా, వాయువులుగా ప్రసరిస్తాయి. ఇతర

యండే పదార్థాల వలెనే సూర్యుని పైతలం కంటే లోపల అధిక ఉష్ణంగా ఉంటుంది. సూర్యుని

కేంద్ర ఉష్ణోగ్రత సుమారు 800 లక్షల డిగ్రీల ఫారన్ హీటు. బాగా చల్లని పైతలం వేరు

చేయగలిగితే సూర్యుని గర్భ గోళంలో వేడి భూమిని, భూమి మీద స్థావరాలను ఒక

క్షణంలో బూడిద చేయగలదు.

ASHOKA DHARMA CHAKRA / అశోకుని ధర్మ చక్రం

 ధర్మానికి చిహ్నం

ప్రాచీన

కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు

పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ చక్రంతో కూడిన స్తంభం

అగ్రభాగాన నాలుగు సింహాలు చెక్కబడి ఉండటంలో ఉన్న రహస్యం ఇదే దర్మానికి చిహ్నంలో

సింహం. సారనాథ్ లోని అశోక స్తంభం మీద ఆ భాగాన్నే భారత ప్రభుత్వం తన అధికారలాంఛనంగా గ్రహించింది.

Saturday, 29 December 2018

కెమెరా ఫ్లాష్ లైట్ ఎలా పని చేస్తుంది?


వెలుతురు సరిగా లేనప్పుడు చీకటిలో ఫోటోలు తీయవలసి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు కెమెరాలో ఫ్లాష్ లైట్ ను ఉపయోగిస్తారు.ఆధునికంగా తయారైన ఫ్లాష్ గన్ లోని క్జెనాన్ ఫ్లాష్ లాంప్ ద్వారా కనంతి వెలువడుతుంది.ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ లు ,విద్యుత్ శక్తి సాయంతో పని చేస్తుంది.డ్రై బ్యాటరీ ద్వారా దీనికి విద్యుత్ లభిస్తుంది.ఆల్టర్నేట్ కరెంట్ ను కూడా లైటు వెలిగించడానికి ఉపయోగించవచ్చు.ఫ్లాష్ లైటు విద్యుత్ ను కాంతి శక్తిగా మారుస్తుంది.ఫ్లాష్ లాంప్ ఒక గాజు నాళిక.సాధారణంగా ఇది 2 అంగుళాల పొడవు ,పావు అంగుళం వ్యాసం కలిగి ఉంటుంది.నాళికలో 2 కొసలలోనూ 2 టంగ్ స్టన్ ఎలక్ట్రోడులను అమరుస్తారు.నాళికలో గాలిని తీసేసి 400-500 మిల్లి మీటర్ల ఒత్తిడి గల క్జెనాన్ వాయువును నింపుతారు.నాళిక చుట్టూ సన్నని తీగను చుడతారు.ఇది 3 వ ఎలక్ట్రోడుగా పని చేస్తుంది.దీనినే ట్రిగ్గర్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటారు.

లాంప్ లోని 2 ఎలక్ట్రోడులను ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు కలుపుతారు.షట్టర్ న్య్ నొక్కగానే ఎలక్ట్రిక్ మీట ఆన్ అవుతుంది.ఈ సమయంలో కెపాసిటర్లో నిల్వ ఉన్న విద్యుత్ క్జెనాన్ లాంప్ ద్వారా వెలువడుతుంది.ఫలితంగా కాంతి వెలువడి ఫోటో తీయవలసిన వస్తువు లేదా మనిషి మీద పడుతుంది.

Thursday, 27 December 2018

బొగ్గు మండుతున్న గదిలో తలుపు మూసుకుని నిద్రించడం ప్రమాదకరం. ఎందుకు ?

బొగ్గు మండుతున్న గదిలో తలుపు మూసుకుని నిద్రించడం చాలా ప్రమాదకరం.
ఎందుకంటే మండుతున్న బొగ్గు కార్బన్ డై ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇది విషపూరితమైన వాయువు.ఈ వాయువు బయటికి పోవడానికి మార్గం లేకపోతే అది గదంతా నిండిపోయి ,గదిలో ఉన్నవారికి శ్వాస ఆడకుండా చేస్తుంది.అందువల్ల అలా నిద్రించడం ప్రాణాలకే ప్రమాదం.

ఎర్నెస్ట్ హెమింగ్వే - అమెరికా రచయిత./ ERNEST HEMINGWAY - AMERICAN WRITER.

అమెరికన్ సాహిత్య చరిత్రలో కొత్త శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్ హెమింగ్వే చికాగో సమీపంలో జన్మించాడు.తండ్రి ప్రముఖ డాక్టరు,క్రీడాకారుడు.1917 లో కాన్సాస్ సిటీ స్టార్ పత్రికలో రిపోర్టర్ గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు.మరుసటి సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసాడు.క్షతగాత్రుడై అమెరిచా తిరిగి వచ్చి టొరంటో స్టార్ అనే వారపత్రికలో ఫీచర్లు రాశాడు.మరికొన్నాళ్లకు ఫారిన్ కరస్పాండెంట్ గా యూరోప్ వచ్చి పారిస్ లో స్థిరపడ్డాడు.1922 లో గ్రీసు,టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్ చేసాడు.మరుసటి సంవత్సరం తొలి పుస్తకం త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయంస్ వెలువడింది.ఆ తరువాతి జీవితమంతా బుల్ ఫైటింగ్,ఆఫ్రికా అడవుల్లో వేట,సముద్రం మీద ఫిషింగ్ లో గడిచింది.స్పానిష్ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు.క్యూబాలో చాలా కాలం గడిపాడు.1961 లో ఆత్మహత్య చేసుకున్నాడు.కథా రచన గురించి ,ముఖ్యంగా శైలి ,వాక్య నిర్మాణం గురించి ఆయన చాలా కృషి చేసాడు.తొలి కథలు ఇన్ అవర్ టైం ( 1925 ) ,ఎ ఫేర్ వెల్ టు ఆర్మ్ స్ ( 1929 ) తో ఒక గొప్ప స్టైలిష్ట్ గా సాహితీ లోకం అతణ్ణి గుర్తించింది.20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లీష్ సాహిత్య శైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేరు.( చైతన్య స్రవంతితో జేంస్ జాయిస్ కూడా ధ్రువ తారగా అవతరించారు ,కాని అది వేరు. )1940 నాటి ఫర్ హూం ది బెల్ టోల్స్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ.1932 లో బుల్ ఫైటింగ్ గురించి డెత్ ఇన్ ద ఆఫ్టర్ నూన్,1935 లో వేట గురించి గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా రాశాడు.సముద్రంలో చేపల వేట గురించి అద్భుత తాత్విక నవల ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ ( 1952 ) తర్వాత 1954 లో హెమింగ్వే ను నోబెల్ బహుమతి వరించింది.
పాఠకుడు మరెంత ఉందో కథ అనుకోవడమే రచయిత ప్రతిభకు గీటురాయి అంటాడు హెమింగ్వే తన శైలి గురించి.కథా వస్తువు కోసం ,ఉద్వేగ భరిత సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు.

Monday, 24 December 2018

సాధారణ థర్మా మీటర్ ,క్లినికల్ థర్మా మీటర్ల మధ్య తేడా ఏమిటి?


సాధారణంగా థర్మా మీటర్ అనగానే మనకు ఆసుపత్రిలో మనకు పరీక్ష చేసే పరికరం గుర్తుకు వస్తుంది.ఈ క్లినికల్ థర్మా మీటర్ లో బల్బ్ దగ్గర ఒక నొక్కు ఉంటుంది.అందువల్ల గొట్టంలో ఒక స్థాయికి పెరిగిన పాదరసం విదిలించనిదే కిందికి దిగదు.ఆ విధంగా అది ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుంది.సాధారణ థర్మా మీటర్ లో ఈ ఏర్పాటు ఉండదు.

Saturday, 22 December 2018

ఓటింగ్ శాతం తగ్గితే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందా?


ఓటింగ్ శాతం పెరిగినా,తగ్గినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.40% పోలింగ్ జరిగే నియోజక వర్గాలు కొన్ని ఉంటే ,90% జరిగేవి మరికొన్ని ఉంటాయి.ఐనా అన్నింటిలో ఓటింగ్ సరళి ఒకేలా ఉంటుంది.కేవలం ఒక్క శాతం ఓటర్లను ప్రశ్నించి చేసే సర్వేల్లోనే ఫలితం ఎలా ఉంటుందో తెలిసిపోతోంది.అలాంటప్పుడు పోలింగ్ శాతంలో తేడా ఫలితాన్ని మార్చుతుందని అనుకోలేము.

ఎన్నికల పట్ల ప్రజలలో ఆసక్తి లేనప్పుడు ,ఏదైనా పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకెళ్ళవచ్చు.ఐతే వారు ఆ పార్టీకే ఓటు వేస్తారని అనుకోవడం పొరబాటు అవుతుంది.ఐదేళ్ళ పరిశీలన ద్వారా తీసుకున్న నిర్ణయం కేవలం ఒక్క అనుభవంతో మారిపోదు.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...