Monday, 24 April 2017

మనకు ఎలా వినిపిస్తుంది? / MANAKU YELA VINIPISTHUNDHI?


చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి.బయటకు కనిపించే బాహ్యచెవి,మధ్య చెవిలను విడదీస్తూ సన్నని కాగితం పొరలాంటి కర్ణభేరి ఉంటుంది.ఇది ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉన్న మూడు చిన్న ఎముకలకు అతుక్కుని ఉంటుంది.బయటి చెవి ముందుగా శబ్దాన్ని గ్రహిస్తుంది.శబ్దం కర్ణభేరికి చేరగానే అది అటూ ఇటూ కదులుతూ కంపనాలను సృష్టిస్తుంది.అపుడు ఉత్పత్తయిన తరంగాలు మధ్య చెవిని చేరతాయి.అక్కడ ఉండే మూడు ఎముకలు ఆ తరంగాల తీవ్రతను రెండింతలు చేసి ,లోపలి చెవికి బదిలీ చేస్తాయి.అక్కడి నుంచి విద్యుత్ తరంగాలుగా మార్పు చెందిన శబ్ద తరంగాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరతాయి.మెదడులోని ఆడిటరీ విభాగం దానిని విశ్లేషిస్తుంది.అప్పుడు మనం వినగలుగుతాము.

అగ్గి పుల్ల ఎలా అంటుకుంటుంది? / AGGI PULLA YELA ANTUKUNTUNDI?


అగ్గిపుల్ల తలకాయను భాస్వరం,మరికొన్ని ఇతర పదార్థాలతో తయారు చేస్తారు.భాస్వరం అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్దే సులభంగా అంటుకుంటుంది.అగ్గిపుల్లను మనం కాస్త గరుకుగా ఉండే అగ్గిపెట్టె పక్క భాగంలో వేగంగా రుద్దినప్పుడు ఆ భాగానికి ,అగ్గిపుల్ల తలకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉష్ణశక్తి పుడుతుంది.అంతే ,ఈ వేడికి అగ్గిపుల్ల వెంటనే అంటుకుని మండటం మొదలుపెడుతుంది.సినిమాల్లో కొందరు హీరోలు చేతుల మీద ,కాళ్ళమీద అగ్గిపుల్లలను గీసి వెగించడం మనం చూస్తుంటాము.సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు.ఐతే వేడిగా ఉన్న బండల మీద ,గోడల పైన అగ్గిపుల్లలను గీసి వాటిని అంటించడం మాత్రం సాధ్యమయ్యే విషయమే.

Friday, 21 October 2016

ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చింది? / DELHI KI AA PERU YELA VACHINDHI?


చారిత్రక ఆధారాలను గమనించినట్లైతే ఢిల్లీని ఏడు సార్లు నిర్మించినట్లు తెలుస్తోంది.దీని మొట్టమొదటి పేరి ' ఇంద్ర ప్రస్థం '.పురాణాలలో ఈ పేరుతోనేఎ పేర్కొనేవారు.క్రీ.పూ.1400 సంవత్సరాల ప్రాంతంలో ఇది పురాణా ఖిల్లా,హుమాయూన్ టూంబ్ ల మధ్య ప్రాంతంలో ఉండేది.క్రీ.పూ.1 వ శతాబ్దంలో కుతుబ్మినార్ ప్రాంతంలో ధిలు అనే రాజు ఢిల్లీని నిర్మించాడు.ఆయన పేరు మీద ఇది వరుసగా ధిల్లి,ఢిల్వి,ఢిల్లీ అయింది.13 వ శతాబ్దంలో కుతుబుద్దీన్ కుతుబ్ మినార్ ను కట్టించి ఢిల్లీ ని రాజధానిగా చేసుకుని పాలించాడు.1296-1316 లో 2 వ సారి ఢిల్లీని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు.3 వ సారి ఢిల్లీని 1320-25 లో ఘియాసుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు.4 వ సారి ఢిల్లీని 1351-88 ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. 5 వ సారి 1526 లో హుమయున్, 6 వ సారి 1540 లో షేర్ షా, 7 వ సారి 1629-58 షాజహాన్ నిర్మించాడు.తర్వాత ఎన్నో సార్లు ఢిల్లీ తన రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది.ఢిల్లీ అని అలవాటుగా మనం అంటున్నాం కానీ నిజానికి దానిని దిల్లీ అనాలి. 

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...