Tuesday, 17 July 2018
బాగా చలిగా ఉన్న రోజు చేతుల్ని వేడెక్కించడానికి చేతుల మీద నోటితో ఊదుకుంటాం ,ఐతే మనం తాగే కాఫీ వేడిగా ఉన్నపుడు ,దానిని చల్లబరచడానికి దాని మీద కూడా గాలిని ఊదుతాం,దీనిని ఎలా వివరించగలవు?
బాగా చలిగా ఉన్న రోజు ఒక వ్యక్తి తన చేతుల మీద గాలి ఊదుకునేటప్పుడు నోరు బాగా తెరిచి ఊదుతాడు.నోటి నుంచి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.ఆ విధంగా చేతులను వేడి చేసుకుంటాడు.ఐతే బాగా వేడిగా ఉన్న కాఫీని ఊదేటప్పుడు నోటిని అంత విశాలంగా తెరవడం జరగదు.బయటకు వచ్చే గాలి అత్యంత ఇరుకైన దారి గుండా మాత్రమే వస్తుంది.కాబట్టి బయటకు వచ్చే గాలి చల్లగా ఉంటుంది.ఈ కారణం వల్లనే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ఒక కంత ద్వారా వాయువు ప్రసరిస్తున్నపుడు శీతలీకరణ ప్రభావం ఉత్పన్నమౌతుంది
Monday, 16 July 2018
డబుల్ డెక్కర్ బస్సు లో పై అంతస్తులోని ప్రయాణీకులను నిలబడనివ్వరు, ఎందుకు?
బస్సు గరిమనాభి పెరగకుండా ఉండడానికి ఇలా చేస్తారు.సమతుల్యత దెబ్బ తిని బస్సు పక్కకి ఒరిగిపోకుండా ఉండడానికి ఇది అవసరం.
కాంక్రీటు రోడ్లను దీర్ఘ చతురస్రాకార పలకలుగా రూపొందిస్తారు ఎందుకు?
ఎండాకాలంలో కాంక్రీటు రోడ్లు బాగా వేడెక్కి వ్యాకోచిస్తాయి.ఫలితంగా రోడ్డు మీద బీటలు పడే అవకాశం ఉంటుంది.కాంక్రీటు రోడ్డు దీర్ఘ చతురస్రాకారపు పలకలు వేడెక్కినపుడు వాటి మధ్య వేసినటువంటి తారును బయటకు నెడతాయి.అందువల్ల బీటలు వరే అవకాశం ఉండదు.
బాగా లోతైన బావి అడుగు భాగం నుంచి మధ్యాహ్నం పూట కూడా మనం నక్షత్రాలను చూడగలమా?
చూడగలం.ఎందుకంటే నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు సూర్య కిరణాల వల్ల అణగిపోదు.సూర్య కిరణాలు బావికి అంచుకు అడ్డంగా,తిర్యక్కుగా ఉంటాయి.కొన్ని నక్షత్రాలు నేరుగా బావి అడుగుకు కనిపించేట్లు ప్రకాశిస్తాయి.
Tuesday, 10 July 2018
మన రెండు కళ్ళతో వస్తువులను రెండుగా చూడం ఎందుకు?
ఒక వస్తువుకు చెందిన రెండు ప్రతిబింబాలూ మన రెండు కళ్ళలోని రెండు రెటీనాలకు సంబంధించిన ఒకే భాగాల మీద సరిగ్గా పడతాయి.అందువల్ల పరివర్తనం కూడా ఏక కాలంలోనే జరుగుతుంది.అందువల్ల రెండు కళ్ళతోనూ ఒకే ఒక దృశ్యం చూడగలం.
Saturday, 7 July 2018
ఒక పాత్రలో మండుతున్న పెట్రోల్ ను నీరు ఆర్పలేదు?
పెట్రోల్ మంట ఉష్ణం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత ఎక్కువగానంటే ఆ మంట మీద నీల్లు పొసినట్లైతే , ఆ నీరు వెంటనే వియోగం చెందుతుంది.అందువల్ల ఆ మంటను నీరు ఆర్పలేదు.
వర్షానికి ముందు మనకు చెమట ఎందుకు పోస్తుంది?
వర్షానికి ముందు వతావరణంలోని గాలి , నీటి ఆవిరితో సంత్రుప్తమౌతుంది. అందువల్ల చెమట పరిశోషం చెందకుండా చర్మానికే అంటిపెట్టుకొంటుంది.
Subscribe to:
Posts (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
నీళ్ళ బకెట్ ను నేరుగా పైకి లాగటం అంటే మనిషి తన కండర బలాన్ని ఊర్ధ్వముఖంగా వాడవలసి ఉంటుంది.స్థిర కప్పీ ద్వారా లాగినప్పుడు ఈ దిశ మారుతుంది .అప్...
-
విద్యుత్ వాహక నిరోధం తీగ అడ్డు కోతతో విలోమంగా ఉంటుంది. మందమైన తీగలకు తక్కువ నిరోధం ఉంటుంది.రాగి ఉత్తమ విద్యుత్ వాహకాలో ఒకటి,కావున విద్యుత్ స...
-
గాలితో నింపిన బెలూన్ ఎక్కువ ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది.అందువల్ల దాని బరువు కంటే ఎక్కువైన వాయు ఊర్ధ్వాభిబలం దానికి సమకూరుతుంది.ఈ ఊర్ధ్వాభిబల...