Tuesday, 17 July 2018
బాగా చలిగా ఉన్న రోజు చేతుల్ని వేడెక్కించడానికి చేతుల మీద నోటితో ఊదుకుంటాం ,ఐతే మనం తాగే కాఫీ వేడిగా ఉన్నపుడు ,దానిని చల్లబరచడానికి దాని మీద కూడా గాలిని ఊదుతాం,దీనిని ఎలా వివరించగలవు?
బాగా చలిగా ఉన్న రోజు ఒక వ్యక్తి తన చేతుల మీద గాలి ఊదుకునేటప్పుడు నోరు బాగా తెరిచి ఊదుతాడు.నోటి నుంచి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.ఆ విధంగా చేతులను వేడి చేసుకుంటాడు.ఐతే బాగా వేడిగా ఉన్న కాఫీని ఊదేటప్పుడు నోటిని అంత విశాలంగా తెరవడం జరగదు.బయటకు వచ్చే గాలి అత్యంత ఇరుకైన దారి గుండా మాత్రమే వస్తుంది.కాబట్టి బయటకు వచ్చే గాలి చల్లగా ఉంటుంది.ఈ కారణం వల్లనే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ఒక కంత ద్వారా వాయువు ప్రసరిస్తున్నపుడు శీతలీకరణ ప్రభావం ఉత్పన్నమౌతుంది
Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
వాహనాన్ని ఎత్తైన ప్రదేశాలపై నడుపుతున్నప్పుడు గురుత్వబలం వాహనాన్ని ఆకర్షిస్తుంది. ఈ గురుత్వ బలాన్ని అధిగమించడానికి డ్రైవర్ వాహన వేగం పెంచుతాడ...
-
కోణాలలోని తేడాను సరిచేసుకోవడానికీ, మలుపులు తిరుగుతున్నప్పుడు కారుకు అధిక స్థిరత్వం ఇవ్వడానికీ ముందు చక్రాలు కొంచెం బయటి వైపుకు వంగి ఉంటాయి.
No comments:
Post a Comment