Thursday, 29 June 2017

అన్ని గ్రహాల మీద రోజుకి 24 గంటలు ఉండవా ? / ANNI GRAHALA MEEDHA 24 GANTALU VUNDAVA?


ఒక పగలుని , ఒక రాత్రిని కలిపి మనం రోజు అంటున్నాము.ఏ గ్రహానికి సంబంధించిన  రోజు ఐనా ఆ గ్రహం తన చుట్టూ తాను ఒకసారి పూర్తిగా తిరిగే  సమయం మీద ఆధారపడీ ఉంటుంది.భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు స్థూలంగా 24 గంటలు పడుతుంది.

అందుకే ఇక్కడ ఒక పగలు ,ఒక రాత్రి పూర్తయ్యేందుకు 24 గంటల సమయం పడుతుంది.కాని అన్ని గ్రహాల సంగతి అలా ఉండదు.ఉదాహరణకు గురు గ్రహం తనచుట్టూ తాను మన భూమి కన్నా చాలా వేగంగా తిరుగుతుంది.అందుకని అక్కడ 10 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది.అంటే ఆ గ్రహం మీద 5 గంటలు పగలు, 5 గంటలు రాత్రి ఉంటుందన్నమాట.అలాగే కుజ గ్రహం మన భూమి అంత వేగంతోనే తిరగడం వల్ల మన రోజుకు అక్కడి రోజుకు పెద్ద తేడా ఏమి ఉండదు.మన రోజుకన్నా అక్కడి రోజులో ఒక 37 నిమిషాలు ఎక్కువగా ఉంటాయంతే.ఇక బుధ గ్రహం మన భూమి కన్నా చాలా నిదానంగా తిరుగుతుంది.మన భూమి మీద 59 రోజులు గదిస్తే కాని అక్కడ ఒక రోజు పూర్తి కాదు.అంటే అక్కడ ఒక రోజుకి 1,416 గంటలన్నమాట.ఇక శుక్రగ్రహం మీదైతే 5832 గంటలు గడిస్తే కాని రోజు పూర్తి కాదు.భూమి మీద 243 రోజులు పూర్తైతే అక్కడ ఒక రోజు పూర్తవుతుంది.అలాగే ఉరేనస్ 16 గంటల 48 నిమిషాలు,నెఫ్త్యూన్ 18 గంటలుఫ్లూటో 168 గంటలు సమయాన్ని ఒక రోజు పూర్తి చేయడానికి తీసుకుంటాయి.ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే సమయాల్లో కూడా చాలా తేడా ఉంటుంది.

భూగర్భ రైలు మార్గం ఎలా నిర్మిస్తారు? / BHUGARBHA RAILUMARGAM YELA NIRMISTARU? / UNDERGROUND RAILWAYS


ఇప్పుడు అన్ని దేశాలలోనూ రైలు మార్గాలు ఉన్నాయి.రేయీ పగలూ మనుషులను సరకులనూ రవాణా చేస్తున్నాయి.అనేక దేశాలలో భూగర్భ రైలు మార్గాలు కూడా ఉన్నాయి.ఐతే ప్రపంచంలోకెల్లా పురాతన రైలు మార్గం మాత్రం లండన్ నగరంలో ఉంది.రైలు మార్గం ఎక్కది నుండి ఎక్కడికి వేయాలో నిర్ణయించిన తర్వాత వీధులలోఅ లోతుగా కందకం తవ్వుతారు.తర్వాత రైలు పట్టాలను పరుస్తారు.గోతిని మూసివేస్తారు.ఈ పద్ధతిని కట్ అండ్ కవర్ అంటారు.

లండనులో నిర్మించిన రైలు మార్గం సుమారు 4 మైళ్ళ పొడవు ఉంది.దీనిని లండన్ నగరంలో పేడింగ్ టన్ స్టేషన్ నుండి ఫారింగ్ టన్ స్టేషన్ వరకు నిర్మించారు.10 జనవరి 1863 నుండి రైళ్ళు తిరగడం ప్రారంభించాయి.మొదట వీటి పై ఆవిరి రైలింజన్ లు నడిచాయి.ఇంజను నుండి వచ్చే పొగ వల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ ప్రపంచంలో తొలి భూగర్భ రైలు మార్గం కావడం తో ప్రయాణీకులు తండోపతండాలుగా వచ్చే వారు.ఈ రైళ్ళలో ప్రతి రోజూ సుమారు 30,000 మంది ప్రయాణించేవారు.

ఆ తర్వాత కొంత కాలానికి మరికొన్ని రైలు మార్గాలను నిర్మించారు.1890 లో లోతైన సొరంగ మార్గం గుండా విద్యుచ్చక్తి రైళ్ళను నడపటానికి వీలుగా రైలు మార్గాలను   లండనులో నిర్మించారు.మొదట్లో రైళ్ళకు కిటికీలు ఉండేవి కావు.ఎందుకంటే రైలు సొరంగంలో వెడుతుంది కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదు.రైల్వే లైనులో లోతైన భూగర్భ స్థలం హేంస్ స్టెడ్ దగ్గర ఉంది.ఇక్కడ లోతు 67.3 మీటర్లు.స్టేషన్ రాగానే రైలు గార్డు స్టేషన్ పేరును గట్టిగా అరిచేవాడు.1979 నాటికి ఈ మార్గంలో 500 రైళ్ళు ప్రయాణీకులను తీసుకెళ్ళాయి.వీటిలో కెల్ల దూరమైన మార్గం ఎప్టింగ్ నుండి రుస్లిప్ కు ఉంది ( 54.8 కి.మీ )

ఇతర దేశాలలో కూడా భూగర్భ రైలు మార్గాలు ప్రజాదరణ పొందాయి.1900 లో పారిస్ లో ప్రారంభించారు.అమెరికాలో మొదటి సబ్ వే లైనును బోస్టన్ లో 1895 -1897 ల మధ్య నిర్మించారు.1904 లో న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైల్వే మొదలయింది.ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పెద్దది.1930 లో మాస్కోలో నిర్మించారు.

జపానులో టోక్యో నగరంలో 1927 లోనే మొదలయింది.కెనడాలో 1954 లో టొరంటో సబ్ వే ప్రారంభించారు.ఇంకా మరికొన్ని దేశాలలో ఈ మార్గాలున్నాయి.మన దేశంలో కలకత్తాలో మొదటి భూగర్భ రైల్వే మార్గం 1986 లో ప్రారంభించారు.

కంప్యూటర్ కి వైరస్ ఎందుకు వస్తుంది? / COMPUTER KI VIRUS YENDHUKU VASTHUNDHI?




కంప్యూటర్ ని పని చేయించేదుకు మనం కొన్ని కమాండ్స్ ఇస్తాము.ఈ కమాండ్స్ అన్నిటిని కలిపి సాఫ్ట్ వేర్ అంటారు.కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్ వేర్ నిర్ణయిస్తుంది.కంప్యూటర్ పనితీరు గురించి బాగా అవగాహన ఉన్నవారు సరదా కోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్ వేర్ లను తయారు చేస్తారు.ఇవి కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం , పని చేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వ ఉన్న సమాచారం అంతా చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి.ఇలాంటి సాఫ్ట్ వేర్ లనే  వైరస్ అంటారు.అందుకే కంపెనీలు తయారు చేసిన వైరస్ లేని సాఫ్ట్ వేర్ లను వాడడం మంచిది.ఇంటర్నెట్నుంచి సమాచారం తీసుకునేటప్పుడు , మెయిల్ చేసేటప్పుడు,కొత్త సాఫ్ట్ వేర్ లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మానవ వైరస్ లకు టీకాలు ఎలాగో , కంప్యూటర్ వైరస్ లను యాంటివైరస్ సాఫ్ట్ వేర్ లను వాడి తొలగించుకోవచ్చు.


Saturday, 24 June 2017

మన వెంట్రుకలు నల్లగా ఎందుకు ఉంటాయి? / MANA VENTRUKALU NALLAGA YENDHUKU UNTAYI?


ప్రపంచంలోని మనుషులందరి వెంట్రుకలు నల్లగా ఉండవు.కొందరివి రాగి వర్ణంలో ఉంటే ,మరి కొందరివి బంగారు వర్ణంలో ఉంటాయి.ఉష్ణ ప్రాంతంలో నివసించే వారి వెంట్రుకలు సాధారణంగా నల్లగానే ఉంటాయి.ఇది ఒక విధంగా ప్రకృతి వరణం కిందికి వస్తుంది.ఎందుకంటే నల్లటి వస్తువులు ఉష్ణాన్ని చక్కగా గ్రహించటమే కాకుండా సులువుగా వదిలిపెడతాయి కూడా.ఈ ఏర్పాటు ఉష్ణప్రాంతాలవారికి సహాయపడేదిగా ఉంటుంది.ఐతే వెంట్రుకలు నల్లగా ఉండటానికి ,కెరొటిన్ అనే పదార్థానికి అవినాభావ సంబంధం ఉంది.వెంట్రుకల్లో కెరొటిన్ ఉంటేనే అవి నల్లగా కనబడతాయి.ఇది లోపిస్తే వెంట్రుకలు నలుపు రంగుని కోల్పోతాయి.వృద్ధాప్యంలో కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వెంట్రుకలు తెల్ల బడతాయి.వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా ఇతర కారణాలతో కూడా కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు.అస్తవ్యస్తంగా ,తీవ్ర ఒత్తిళ్ళ తో కూడిన జీవన శైలి వల్ల , శరీర ధర్మం వల్ల,వంశపారంపర్య లక్షణాల వల్ల,విపరీతమైన చింతల వల్ల కొందరికి చిన్నతనంలోనే జుత్తు నెరసిపోవచ్చు.ఐతే ఇలా జుత్తు నెరసిపోవడం వ్యాధి కాదు.

Monday, 19 June 2017

చంద్ర మండలంపై శబ్దాన్ని వినలేము ఎందుకు? / CHANDRAMANDALAM PAI SHABDHANNI VINALEMU YENDHUKU?


కంపించే వస్తువుల వల్ల ధ్వని పుడుతుంది.ఐతే కంపించే అన్ని వస్తువుల ధ్వని మనం వినలేము.మనం వినగలిగే వాటిని శ్రావ్య ధ్వనులంటారు.శబ్దం యాంత్రిక తరంగం అవడం వల్ల దీని ప్రసారానికి యానకం కావాలి.అనగా ఘన,ద్రవ,వాయు పదార్థాలలో,ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కంపనాల వల్ల ధ్వని పుడుతుంది.శూన్యంలో యానకం ఉండదు కాబట్టి కంపనాలు జరగవు.అందువల్ల ధ్వని జనించదు.కాబట్టి శూన్యంలో లేదా చంద్రునిపై శబ్ద వేగం సున్నా .అందుకే మనిషి చంద్ర మండలం పై మామూలుగా మట్లాడడానికి వీలు కాదు.అంతే కాక చప్పట్లు కొట్టినా,తుపాకి పేల్చినా ,బాంబు పేల్చినా వాటి శబ్దాలేవీ మన చెవిని చేరవు.అందుకే చంద్రునిపై ధ్వని వినలేము అంటారు.

Monday, 12 June 2017

రక్తంలో ఏమేం ఉంటాయి? / RAKTHAM LO YEMEM VUNTAYI?


రక్తం ఒక ద్రవ రూప కణజాలం.మన రక్తంలో 55% ద్రవ రూప ప్లాస్మాతోనూ,మరో 45% వివిధ రకాల కణాలతో కలిపి ఉంటుంది.రక్త కణాల్లో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు , తెల్ల రక్త కణాలు , రక్త కణ ఫలకికలు / ప్లేట్ లెట్స్ ఉంటాయి.
        కాగా రక్తంలోని ప్లాస్మాలో 92% నీరు ఉంటే ,ప్రొటీన్లు , అయాన్లు వంటివన్నీ కలిపి మిగతా 8% ఉంటాయి.ఐతే ఇది అన్ని రకాల జీవులకు ఒకే విధంగా ఉండదు.ఒకే కుటుంబానికి చెందిన జీవులైనప్పటికీ ,అవి వేర్వేరు రకాలకు చెందినవైనప్పుడు వాటి రక్త సాంద్రత కూడా వేర్వేరుగా ఉంటుంది.అలాగే ఆడ జీవుల రక్త సాంద్రతకు ,మగ జీవుల రక్త సాంద్రతకు తేడా స్పష్టంగా ఉంటుంది.మనం ఉండే భంగిమను బట్టి శరీరంలోని వివిధ అవయవాల వద్ద రక్త సాంద్రతలో తేడా ఉంటుంది.ఉదాహరణకు కూర్చున్నప్పటికన్నా నిలబడి ఉన్న సమయంలో మన శరీరంలోని కొన్ని ప్రాంతాలలో రక్త సాంద్రత హెచ్చుగా ఉంటుంది.రక్తం నిర్వహించే ధర్మాన్ని బట్టి మొత్తం జంతువులను ప్రధానంగా ఉష్ణ రక్త జీవులు , శీతల రక్త జీవులుగా వర్గీకరించారు.మనం ఉష్ణ రక్త జీవుల కిందికి వస్తాము.ఈ కోవకు చెందిన జంతువుల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.ఆ విధంగా చేసే యంత్రాంగం ,ఏర్పాట్లు వాటి శరీరంలో ఉంటాయి.ఇక శీతల రక్త జీవుల శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది.ఏదేమైనా మేధస్సు విషయంలో శీతల రక్త జీవుల కన్నా ఉష్ణ రక్త జీవులు ముందంజలో ఉన్నాయి.

Thursday, 8 June 2017

THOLI MAHILA YUDDHA VIMANA PILOTS / తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లు

తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లు

భారత వాయుసేనలో మొట్ట మొదటి ఫ్లైయింగ్ ఆఫీసర్లుగా ఎంపికై రికార్డు సృష్టించిన భావనా కాంత్ , మోహనా సింగ్ ,అవనీ చతుర్వేది 
పశ్చిమ బెంగాల్ లోని కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో బ్రిటిష్ హాక్ విమానాలతో శిక్షణ పొందారు.మొదటి దశలో వారికి అధునాతనమైన ఎస్ యు 30 విమనలు కెటాయిస్తున్నారు.2015 అక్టోబర్ లో ఫైటర్ పైలట్ ల ఎంపికలో మహిళల ప్రవేశం పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. 


వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...