కంప్యూటర్ ని పని చేయించేదుకు మనం కొన్ని కమాండ్స్ ఇస్తాము.ఈ కమాండ్స్ అన్నిటిని కలిపి సాఫ్ట్ వేర్ అంటారు.కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్ వేర్ నిర్ణయిస్తుంది.కంప్యూటర్ పనితీరు గురించి బాగా అవగాహన ఉన్నవారు సరదా కోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్ వేర్ లను తయారు చేస్తారు.ఇవి కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం , పని చేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వ ఉన్న సమాచారం అంతా చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి.ఇలాంటి సాఫ్ట్ వేర్ లనే వైరస్ అంటారు.అందుకే కంపెనీలు తయారు చేసిన వైరస్ లేని సాఫ్ట్ వేర్ లను వాడడం మంచిది.ఇంటర్నెట్నుంచి సమాచారం తీసుకునేటప్పుడు , మెయిల్ చేసేటప్పుడు,కొత్త సాఫ్ట్ వేర్ లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మానవ వైరస్ లకు టీకాలు ఎలాగో , కంప్యూటర్ వైరస్ లను యాంటివైరస్ సాఫ్ట్ వేర్ లను వాడి తొలగించుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఏదైనా ఒక యానకం నుండి ఎలక్ట్రానులు ఒక నిర్దిష్ట దిశలో,నిర్దిష్ట వేగంతో ప్రయాణించడాన్నే మనం విద్యుత్తు అని అంటున్నాము.ఇలా ప్రవహించడం ద్వారా పు...
-
కంప్యూటర్ ని పని చేయించేదుకు మనం కొన్ని కమాండ్స్ ఇస్తాము.ఈ కమాండ్స్ అన్నిటిని కలిపి సాఫ్ట్ వేర్ అంటారు.కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది ...
No comments:
Post a Comment