Tuesday, 6 June 2017

జలుబు,దగ్గులాంటివి,వానాకాలం,చలి కాలాల్లోనే ఎందుకొస్తాయి?మిగతా కాలాల్లో ఎందుకు రావు?JALUBU,DAGGU LANTIVI VANAKALAM,CALI KALAMLONE ENDUKOSTAYI?MIGATA KALALLO ENDUKU RAVU.?


జలుబు సాధారణంగా వైరస్ ద్వారా వస్తుంది.వాతావరణంలోనూ,తాగే నీటిలోనూ,దుమ్ము,ధూళి కణాలపైన వైరస్ ఉంటుంది.బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్ లు వృద్ధి కాలేవు.ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్యక్టీరియా ,ఇతర సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది.వాట్పై ఆధారపడే వైరస్ లు కూడా తక్కువగానే ఉంటాయి.ఎక్కడపడితే అక్కడ తడి ఉండకపోవడం వల్ల వైరస్ ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ.కాబట్టి జలుబు కలిగించే వైరస్ ల ప్రభావం తక్కువగా ఉంటుంది.వానా కాలంలో నీరు వివిధ పదార్థాలను తనతో తీసుకెల్తుంది.ఇవి తాగునీటి వనరులనూ కలుషితం చేస్తాయి.వైరస్ ల వ్యాప్తికి దోహద పడతాయి.వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా,దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది.తద్వారా వైరస్ ల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. 

Sunday, 4 June 2017

ఈతగాళ్ళు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? / EETHAGALLU PRATHYEKAMAINA KALLADDHALU YENDHUKU PETTUKUNTARU?


కాంతికిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక నిర్దిష్టకోణంలోనికి వంగుతాయి.ఇంకోలా చెప్పాలంటే అలాంటి సందర్భాలలో వాటి ప్రయాణమార్గంలో మార్పు వస్తుంది.దీనినే వక్రీభవనం అంటారు.వస్తువు నుంచి పరావర్తనం చెంది బయలుదేరే కాంతి ముందుగా గాలిలోనూ ,ఆ తరువాత మన కంటి పైభాగంలోనూ రెండు సార్లు వక్రీభవనానికి గురై ,చివరకు రెటీనాపై పడుతుంది.ఆ విధంగా మనకు ఒక వస్తువు లేదా దృశ్యం కనిపిస్తుంది.కాని ఒక వేల గాలి వక్రీభవనగుణకం ,మన కంటి వక్రీభవన గుణకం ఒకేవిధంగా ఉన్నట్లైతే ఆయా వస్తువులను చూడడం మనకు చాలా కష్టమౌతుంది.దానికి భిన్నంగా నీటి వక్రీభవన గుణకం ,మన కంటి వక్రీభవన గుణకం దాదాపుగా ఒకేలా ( 1.34 ) ఉంటాయి.ఇలా రెండు యానకాల వక్రీభవన గుణకాలు సమానంగా ఉన్నప్పుడు ,ఒక యానకం నుండి మరొక యానకంలోనికి కాంతి దూసుకుపోయినప్పుడు గమన మార్గంలో ఎటువంటి మార్పు రాక అది సూటిగా దూసుకు పోతుంది.అలాంటి సమయాల్లో వస్తువులను చూడడం మనకు కష్టమౌతుంది.నీటిలో ఉన్నప్పుడు ఈ కారణంగానే మనకు వివిధ వస్తువులు ,జలచరాలు స్పష్టంగా కాకుండా అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి.ఇలా జరగకుండా ఉండడం కోసమే సముద్రంలో ఈదే వాళ్లు ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరిస్తారు.ఈ కళ్ళద్దాలలో గాజుపలకల మధ్య గాలి నిండి ఉంటుంది.నీటిలోంచి వచ్చిన కిరణాలు గాలిలోనికి ప్రవేశించి , ఆ తర్వాతే కళ్ళలోకి వస్తాయి.దాంతో అవి వేర్వేరు వక్రీభవనాలకు గురై చివరకు ఆ వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి.

Saturday, 27 May 2017

NEETIKI YE RANGU YENDUKUNDADU?/ నీటికి ఏ రంగూ ఎందుకుండదు?

ఏదైనా ఒక వస్తువు పసుపు రంగులో కనిపిస్తుంది అంటే దానర్థం అది తెల్లని కాంతిలోని అన్ని రంగులనూ శోషించుకుని ఒక పసుపు రంగుని మాత్రమే తిప్పి కొడుతుంది అని.అన్ని వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.ఇలా వస్తువుపై పడి పరావర్తనం చెంది వచ్చి మన కంటిని చేరే కాంతికిరణాల మూలంగానే మనం ఆ వస్తువును , దాని రంగును తెలుసుకోగలుగుతున్నాం.

పాల లాగా పూర్తిగా తెల్లగా ఉండే పదార్థాలు, బొగ్గులాగా పూర్తిగా నల్లగా ఉండే పదార్థాలు కాంతి విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తాయి.తెల్లని వస్తువులు అన్ని రకాల కాంతికిరణాలను తిప్పికొడితే , నల్లని వస్తువులు అన్ని కాంతికిరణాలను శోషింపచేసుకుంటాయి.అందువల్ల తెల్లని వస్తువులు తెల్లగా, నల్లని వస్తువులు నల్లగా కనిపిస్తాయి.{ నల్లని వస్తువుపై పడిన కాంతికిర్ణాల్లో కొన్నైనా తిరిగిరావడం వల్ల అది కనిపిస్తుంది , లేకపోతే అదికూడా ఉండదు.}

ఇక నీటి విషయానికి వస్తే ,అదికూడా తెల్లని వస్తువుల్లాగా,నల్లని వస్తువుల్లాగా కాంతికి సంబంధించిన విభిన్న కిరణాల విషయంలో ఎలాంటి భేదభావం చూపదు.

అంటే నీరు తనపై పడే కాంతిలోని అన్ని రంగులనూ సమానంగా శోషింపచేసుకుంటుంది,సమానంగా పరావర్తనం చెందిస్తుంది,అదే సమయంలో అన్ని రంగులనూ తనగుండా పోనిస్తుంది.సాధారణంగా నీటిపై పడిన కాంతిలో ఎక్కువ భాగం దానిగుండా ప్రయాణించి అంతర్థానమైపోతుంది.నీటికి ఉన్న ఇలాంటి ప్రత్యేక ధర్మాల వల్లనే అది ఏ రంగూ లేకుండా కంపిస్తుంది.
ఒకవేళ ఎక్కడైన ఏ నీరైనా ఏదైనా రంగులో ఉందంటే అది స్వచ్చమైన నీరు కాదని,లేదా దాని పరిసరాలలోని వివిధ అంశాల ప్రభావం దానిపై బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి.

ఆకలి ఎందుకు వేస్తుంది? / AKALI YENDUKU VESTHUNDHI?


మన శరీరం ఎప్పుడూ ఒక యంత్రంలా పని చేస్తుంది.అందుకొరకు ప్రతి అవయవానికి శక్తి కావాల్సి ఉంటుంది.ఆయా సందర్భాలను బట్టి,చేసే పనులను బట్టి మనకు కావలసిన శక్తిలో కొచెం హెచ్చుతగ్గులు చోటుచేసుకోవచ్చు.అది వేఅరే విషయం.మనకు కావలసిన శక్తి,తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది.ఈ శక్తిని,వేడి ,చలనం వంటి వేర్వేరు శక్తి రూపాల్లోనికి మార్చుకొని సరీరం ఉపయోగించుకుంటుంది.అందుకని శక్తి ఉత్పాదనకు అవసరమయ్యే ఆహారం ,నీరు కావాల్సి వచ్చినప్పుడల్లా సరీరం అందుకు తగిన సంకేతాలను మెదడుకు పంపుతుంది.మెదడుకు అందే ఈ సంకేతాలు,అలాగే వాటికి మెదడు స్పందించడంలో భాగంగా మనకు ఆకలి,దాహం తెలుస్తాయి.ఇంతకుముందు మనం తీసుకున్న ఆహారం ఖర్చయిపోయి కడుపు ఖాళీగా మారినప్పుడు ఆ విషయం నాడీమండలం ద్వారా మెదడుకు అందుతుంది.సరిగ్గా అలాంటి సమయాల్లోనే మనకు ఆకలిగా అనిపిస్తుంది.దానితో ఆ ఆకలిని తీర్చుకునేందుకు ఏదొ ఒకటి తిని శరీర శక్తి అవసరాలను తీర్చుకుంటాము.

Saturday, 6 May 2017

పాలు ఎందుకు పొంగుతాయి? / PALU YENDUKU PONGUTHAYI?



పాలలో 85% నీరు ఉంటుంది.మిగతా 15%కొవ్వులు,మాంసకృత్తులు,చక్కెర,ఇంకా లవణాలు ఉంటాయి.పాలల్లో ఈ పదార్థాలన్నీ ఉన్నందున మామూలు నీరు మరిగే ఉష్ణోగ్రతకి,పాలు మరిగే ఉష్ణోగ్రతకి కొంత తేడా వస్తుంది.సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుందన్న సంగతి తెలుసు .పాలు మరిగే ఉష్ణోగ్రత దీనికన్నా ఓ అర డిగ్రీ ఎక్కువగా ఉంటుంది.ఐతే పాలు మరగడానికి కొంచెం ముందుగా అందులోని కొవ్వు,మాంస కృత్తుల్లో  కొంత భాగం పాల పై భాగంలో ఒక పలుచని పొరలాగా రూపొందుతుంది.పాలు మరిగే ఉష్ణోగ్రతకి చేరి అందులోంచి నీటి ఆవిరి బయటకు రావడం మొదలుపెట్టినప్పుడు ఈ మీగడ పొర దానికి అడ్డుగా నిలుస్తుంది.ఐతే నీటి ఆవిరి ఊర్ధ్వ ముఖంగా కలిగించే ఒత్తిడి మూలంగా ఈ మీగడ పొర తప్పనిసరై గిన్నెలో పైకి లేస్తుంది.కాని ఆవిరి కలిగించే ఒత్తిడి కారణంగా ఇందులో పలు పగుళ్లు వస్తాయి.పాలలో ఉండే కొవ్వు ,మాంస కృత్తుల సాయంతో ఆ పగుళ్లు క్షణాలలో పూడి, మళ్లీ కొత్త పొర రూపొందుతుంది.దాంతో  నీటి ఆవిరి ఆ పొరను మళ్ళీ పైకి ఎగదన్నుతుంది.సరిగ్గా ఈ ప్రక్రియనే మనం పాలు పొంగడం అని అంటున్నాం.నీటి ఆవిరితో పైకి లేచిన మీగడ పొర మళ్ళీ పగలడం,తిరిగి మీగడ పొర కొత్తగా ఏర్పడడం అనే ప్రక్రియ కొన్ని నిమిషాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.ఒక్కోసారి ఇందులో భాగంగా పాలు బాగా పొంగి గిన్నె బయటకు కూడా వస్తుంది.

Monday, 24 April 2017

మనకు ఎలా వినిపిస్తుంది? / MANAKU YELA VINIPISTHUNDHI?


చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి.బయటకు కనిపించే బాహ్యచెవి,మధ్య చెవిలను విడదీస్తూ సన్నని కాగితం పొరలాంటి కర్ణభేరి ఉంటుంది.ఇది ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉన్న మూడు చిన్న ఎముకలకు అతుక్కుని ఉంటుంది.బయటి చెవి ముందుగా శబ్దాన్ని గ్రహిస్తుంది.శబ్దం కర్ణభేరికి చేరగానే అది అటూ ఇటూ కదులుతూ కంపనాలను సృష్టిస్తుంది.అపుడు ఉత్పత్తయిన తరంగాలు మధ్య చెవిని చేరతాయి.అక్కడ ఉండే మూడు ఎముకలు ఆ తరంగాల తీవ్రతను రెండింతలు చేసి ,లోపలి చెవికి బదిలీ చేస్తాయి.అక్కడి నుంచి విద్యుత్ తరంగాలుగా మార్పు చెందిన శబ్ద తరంగాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరతాయి.మెదడులోని ఆడిటరీ విభాగం దానిని విశ్లేషిస్తుంది.అప్పుడు మనం వినగలుగుతాము.

అగ్గి పుల్ల ఎలా అంటుకుంటుంది? / AGGI PULLA YELA ANTUKUNTUNDI?


అగ్గిపుల్ల తలకాయను భాస్వరం,మరికొన్ని ఇతర పదార్థాలతో తయారు చేస్తారు.భాస్వరం అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్దే సులభంగా అంటుకుంటుంది.అగ్గిపుల్లను మనం కాస్త గరుకుగా ఉండే అగ్గిపెట్టె పక్క భాగంలో వేగంగా రుద్దినప్పుడు ఆ భాగానికి ,అగ్గిపుల్ల తలకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉష్ణశక్తి పుడుతుంది.అంతే ,ఈ వేడికి అగ్గిపుల్ల వెంటనే అంటుకుని మండటం మొదలుపెడుతుంది.సినిమాల్లో కొందరు హీరోలు చేతుల మీద ,కాళ్ళమీద అగ్గిపుల్లలను గీసి వెగించడం మనం చూస్తుంటాము.సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు.ఐతే వేడిగా ఉన్న బండల మీద ,గోడల పైన అగ్గిపుల్లలను గీసి వాటిని అంటించడం మాత్రం సాధ్యమయ్యే విషయమే.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...