పాలలో 85% నీరు ఉంటుంది.మిగతా 15%కొవ్వులు,మాంసకృత్తులు,చక్కెర,ఇంకా లవణాలు ఉంటాయి.పాలల్లో ఈ పదార్థాలన్నీ ఉన్నందున మామూలు నీరు మరిగే ఉష్ణోగ్రతకి,పాలు మరిగే ఉష్ణోగ్రతకి కొంత తేడా వస్తుంది.సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుందన్న సంగతి తెలుసు .పాలు మరిగే ఉష్ణోగ్రత దీనికన్నా ఓ అర డిగ్రీ ఎక్కువగా ఉంటుంది.ఐతే పాలు మరగడానికి కొంచెం ముందుగా అందులోని కొవ్వు,మాంస కృత్తుల్లో కొంత భాగం పాల పై భాగంలో ఒక పలుచని పొరలాగా రూపొందుతుంది.పాలు మరిగే ఉష్ణోగ్రతకి చేరి అందులోంచి నీటి ఆవిరి బయటకు రావడం మొదలుపెట్టినప్పుడు ఈ మీగడ పొర దానికి అడ్డుగా నిలుస్తుంది.ఐతే నీటి ఆవిరి ఊర్ధ్వ ముఖంగా కలిగించే ఒత్తిడి మూలంగా ఈ మీగడ పొర తప్పనిసరై గిన్నెలో పైకి లేస్తుంది.కాని ఆవిరి కలిగించే ఒత్తిడి కారణంగా ఇందులో పలు పగుళ్లు వస్తాయి.పాలలో ఉండే కొవ్వు ,మాంస కృత్తుల సాయంతో ఆ పగుళ్లు క్షణాలలో పూడి, మళ్లీ కొత్త పొర రూపొందుతుంది.దాంతో నీటి ఆవిరి ఆ పొరను మళ్ళీ పైకి ఎగదన్నుతుంది.సరిగ్గా ఈ ప్రక్రియనే మనం పాలు పొంగడం అని అంటున్నాం.నీటి ఆవిరితో పైకి లేచిన మీగడ పొర మళ్ళీ పగలడం,తిరిగి మీగడ పొర కొత్తగా ఏర్పడడం అనే ప్రక్రియ కొన్ని నిమిషాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.ఒక్కోసారి ఇందులో భాగంగా పాలు బాగా పొంగి గిన్నె బయటకు కూడా వస్తుంది.
Saturday, 6 May 2017
పాలు ఎందుకు పొంగుతాయి? / PALU YENDUKU PONGUTHAYI?

Subscribe to:
Post Comments (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-

నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అ...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...
No comments:
Post a Comment