Saturday, 24 June 2017

మన వెంట్రుకలు నల్లగా ఎందుకు ఉంటాయి? / MANA VENTRUKALU NALLAGA YENDHUKU UNTAYI?


ప్రపంచంలోని మనుషులందరి వెంట్రుకలు నల్లగా ఉండవు.కొందరివి రాగి వర్ణంలో ఉంటే ,మరి కొందరివి బంగారు వర్ణంలో ఉంటాయి.ఉష్ణ ప్రాంతంలో నివసించే వారి వెంట్రుకలు సాధారణంగా నల్లగానే ఉంటాయి.ఇది ఒక విధంగా ప్రకృతి వరణం కిందికి వస్తుంది.ఎందుకంటే నల్లటి వస్తువులు ఉష్ణాన్ని చక్కగా గ్రహించటమే కాకుండా సులువుగా వదిలిపెడతాయి కూడా.ఈ ఏర్పాటు ఉష్ణప్రాంతాలవారికి సహాయపడేదిగా ఉంటుంది.ఐతే వెంట్రుకలు నల్లగా ఉండటానికి ,కెరొటిన్ అనే పదార్థానికి అవినాభావ సంబంధం ఉంది.వెంట్రుకల్లో కెరొటిన్ ఉంటేనే అవి నల్లగా కనబడతాయి.ఇది లోపిస్తే వెంట్రుకలు నలుపు రంగుని కోల్పోతాయి.వృద్ధాప్యంలో కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వెంట్రుకలు తెల్ల బడతాయి.వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా ఇతర కారణాలతో కూడా కెరొటిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు.అస్తవ్యస్తంగా ,తీవ్ర ఒత్తిళ్ళ తో కూడిన జీవన శైలి వల్ల , శరీర ధర్మం వల్ల,వంశపారంపర్య లక్షణాల వల్ల,విపరీతమైన చింతల వల్ల కొందరికి చిన్నతనంలోనే జుత్తు నెరసిపోవచ్చు.ఐతే ఇలా జుత్తు నెరసిపోవడం వ్యాధి కాదు.

No comments:

Post a Comment