ఏదైనా ఒక యానకం నుండి ఎలక్ట్రానులు ఒక నిర్దిష్ట దిశలో,నిర్దిష్ట వేగంతో ప్రయాణించడాన్నే మనం విద్యుత్తు అని అంటున్నాము.ఇలా ప్రవహించడం ద్వారా పుట్టే శక్తిని ఉష్ణ శకి గానూ,కాంతి శక్తిగానూ,చలన శక్తి, అంకా యాంత్రిక శక్తి వంటి రకరకాల శక్తి రూపాలలోకి మార్చి మన అవసరాలకు వాడుకుంటున్నాము.ఉదాహరణకు కరంటు బల్బు ద్వారా విద్యుత్ ను కాంతి రూపంలోకి మార్చుకుంటే ,కరంట్ స్తవ్ ద్వారా దానిని ఉష్ణ శక్తి గా మార్చుకుని వాడుకుంటున్నాము.విద్యుత్ కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి,అయస్కాంత తత్వానికి ఒక విడదీయలేని సంబంధం ఉంది.ఎలాగ అంటే ఒక తీగ గుండా ఒక నిర్దిష్ట దిశలో ఎలక్ట్రానులు ప్రవహించేలా చేసినప్పుడు ఆ తీగ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.అదే విధంగా ఏదన్నా ఒక తీగ మీదుగా ఒకే దిసలో అయస్కాంతాన్ని కదిలించినప్పుడు,అయస్కాంతానికి సంబంధించిన అయస్కాంత శక్తి తీగలోని ఎలక్ట్రానులను ఆ దిశలో ముందుకు చలించేలా చేస్తుంది.జనరేటర్ కూడా సరిగ్గా ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని పని చేస్తుంది.జనరేతర్ లో ఉండే అయస్కాంతం ఒక వైరుకు దగ్గరగా కదలడం ద్వారా ఆ వైరులోని ఎలక్ట్రానులు నిలకడగా ప్రవహించేలా చేస్తుంది.ఒక విధంగా చూస్తే అచ్చం ఒక నీటి పంపు పనిచేసేటట్లుగానే జనరేటర్ కూదా పని చేస్తుందని చెప్పవచ్చు.నీటి పంపు ఒక నిర్దిష్ట మొత్తంలోని నీటి అణువులను కదిలించడమే కాకుండా ,వాటిపై ఒక నిర్దిష్ట మొత్తంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.సరిగ్గా ఇదే విధంగా జనరేటర్ కూడా నిర్దిష్ట మొత్తంలో ఎలక్ట్రానులను లాగడమే కాకుండా వాటిపై నిర్దిష్ట పరిమాణంలో ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.దానితో ఆ ఎలక్ట్రానులు విధిగా ముందుకు ప్రయాణించి విద్యుత్తును సృష్టిస్తాయి.జనరేటర్ పనిచేసినంత సేపు ఈ చర్య నిరంతరంగా కొనసాగుతూ మనకు కావలసినంత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.
No comments:
Post a Comment