Friday, 14 December 2018

నీటి మీద తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి?/ PUMICE STONES

నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.ఫ్యుమైస్ స్టొన్స్ గా వ్యవహరించే ఈ రాళ్లు ఏళ్ల తరబడి నీటిపై తేలడం వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది చాలా కాలం వరకు అంతుబట్టలేదు.ఈ చిక్కుముడిని విప్పడానికి లారెన్స్ బెర్క్ లీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.వారి పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.ఎక్ష్ రే ల సహాయంతో రాళ్లను పరీక్షించగా మన చర్మంపై ఉన్న రోమాల తరహాలో ఈ రాళ్లపై సూక్ష్మ స్థాయిలో రంధ్రాలు ఉన్నాయని తేలింది.వీటితో పాటు రాళ్లలో రకరకాల వాయువులు ఉన్నట్లు గుర్తించారు.అంతర్భాగంలో చిక్కుకుపోయిన ఈ వాయువుల కారణంగానే ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని నిర్ధారణకు వచ్చారు.

Thursday, 13 December 2018

తాగే నీటిలో ఫ్లోరైడ్ ను ఎందుకు కలుపుతారు?



ఫ్లోరిన్ లేదా మరింత ఖచ్చితంగా చెప్పాలంటే సోడియం ఫ్లోరీడ్ ఉన్న తాగునీరు ,దంతాల సమస్యను నివారించడంలో తోడ్పడుతుందని విశ్వసించడమైనది.దంతాల మీద ఆంలాలను ఏర్పరిచే సమస్యలో సోడియం ఫ్లోరైడ్ జోక్యం చేసుకుంటుంది.ఈ నోటి ఆంలాలను దంతాలు తట్టుకునేలా చేయడంలో కూడా ఇది తోడ్పడుతుంది.ఐతే మరీ ఎక్కువ ఫ్లోరైడ్ దంతాలకు హాని కలిగిస్తుందని ఈ సందర్భంగా గమనించవలసి ఉంటుంది.

దీపం వత్తి ద్వారా చమురు / నూనె ఏ విధంగా పైకి వస్తుంది?


వత్తిలోని తంతువుల మధ్య గాలి దూరే స్థలం ఉండటం వల్ల వత్తిలో చాలా సన్నని రంధ్రాలు గల అసంఖ్యాకమైన కేశికలు ఉంటాయని పరిగణించడమైనది.ఈ వత్తికి చెందిన ఒక భాగాన్ని చమురులో ముంచినప్పుడు కేశిక చర్య కారణంగా చమురు వత్తి పై భాగానికి ప్రసారమౌతుంది.

బెలూన్ లు గాలిలో ఎగరడానికి ఏ నియమం వర్తిస్తుంది?


గాలితో నింపిన బెలూన్ ఎక్కువ ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది.అందువల్ల దాని బరువు కంటే ఎక్కువైన వాయు ఊర్ధ్వాభిబలం దానికి సమకూరుతుంది.ఈ ఊర్ధ్వాభిబలం వల్ల ,ప్లవన నియమం ప్రకారం బెలూన్ గాలిలో ఎగురుతుంది.

Wednesday, 12 December 2018

గాలి నింపిన బెలూన్ పైకి ఎగురుతూ ఒక నిర్ణీతమైన ఎత్తులో నిలిచిపోతుంది. ఎందుకు ?


మనం వాతావరణంలో పైకి పోయే కొద్దీ ,వాతావరణ సాంద్రత తగ్గిపోతుంది.పైకి ఎగురుతున్న బెలూన్ లోని వాయు సాంద్రత,గాలి సాంద్రతకంటే తక్కువగా ఉన్నంతవరకు మాత్రమే అది పైకి పోతుంది.వాతావరణ సాంద్రత బెలూన్ లోని వాయుసాంద్రతతో సమానమైన ఎత్తుకు చేరిన క్షణం ,బెలూన్ పైకి పోవడం ఆగిపోయి అక్కడే నిలిచిపోతుంది.

Tuesday, 11 December 2018

విమానానికి ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి జాగ్రత్తగా కిందికి దిగడంలో ప్యారాచూట్ ఎలా సహకరిస్తుంది?


ప్యారాచూట్ కోటరంలో తగినంత గాలి ఉంటుంది.కిందికి దిగేటప్పుడు ప్యారాచూట్ అకస్మాత్తుగా కిందికి పడిపోకుండా ఉండటానికి ఈ కోటరంలోని గాలి దాన్ని పైకి లేపుతూ ఉంటుంది.అందువల్ల ప్యారాచూట్ నెమ్మదిగా కిందికి దిగుతుంది.

వాహనాన్ని ఎత్తైన ప్రదేశానికి ఎక్కిస్తున్నప్పుడు మామూలుగా డ్రైవర్ వేగం పెంచుతాడు.ఎందుకు?


వాహనాన్ని ఎత్తైన ప్రదేశాలపై నడుపుతున్నప్పుడు గురుత్వబలం వాహనాన్ని ఆకర్షిస్తుంది. ఈ గురుత్వ బలాన్ని అధిగమించడానికి డ్రైవర్ వాహన వేగం పెంచుతాడు.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...