Friday, 23 November 2018

బావిలోంచి నీళ్ళ బకెట్ ను నేరుగా లాగడం కంటే స్థిర కప్పీ ద్వారా లాగడం సులువు ,ఎందుకు ?


నీళ్ళ బకెట్ ను నేరుగా పైకి లాగటం అంటే మనిషి తన కండర బలాన్ని ఊర్ధ్వముఖంగా వాడవలసి ఉంటుంది.స్థిర కప్పీ ద్వారా లాగినప్పుడు ఈ దిశ మారుతుంది .అప్పుడు అధో ముఖంగా మన శక్తిని ఉపయోగించ వలసి ఉంటుంది,ఇది  అనువైన దిశ.

థర్మాస్ ఫ్లాస్క్ లో వేడిగా ఉన్న ద్రవం వేడిగానే ఎందుకు ఉంటుంది?



సంవాహనాల ద్వారా ఉష్ణ మార్పిడిని నిరోధిస్తూ ద్రవాన్ని స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి థర్మాస్ ఫ్లాస్క్ లో రెండు గోడలూ మధ్యలో పూర్తిగా శూన్యమూ ఉండే గాజు పాత్రను వాడతారు,వికిరణం ద్వారా ఉష్ణమార్పిడిని తగ్గించడానికి లోపలి తలాలకు సిల్వర్ పూత పూస్తారు.

Wednesday, 21 November 2018

నీటి వల్ల గ్లాసుకు తడి అంటుతుంది,కాని పాదరసం వల్ల అంటదు,ఎందుకు?


నీటి అణువుల మధ్య ఉండే సంసక్తం తో పోలిస్తే నీటి అణువులకూ ,గ్లాసుకూ మధ్య ఉండే అసంసక్తం ఎక్కువ.పాదరసం విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

Saturday, 17 November 2018

ఆనకట్ట మందం పై నుంచి అడుగుకు పోయే కొద్దీ పెరుగుతుంది,ఇలా రూపొందించటానికి గల కారణమేమిటి?


కిందికి పోయే కొద్ది పార్శ్వ పీడనం పెరుగుతుంది.ఇది పై భాగాన శూన్యంగా ఉంటే కింది భాగాన గరిష్టంగా ఉంటుంది.అందువల్లనే ఆనకట్ట అడుగు భాగం పై భాగం కంటే ఎక్కువ మందంగా ఉంటుంది.

Saturday, 8 September 2018

విటమిన్ ' పి ' అంటే ఏమిటి ?



విటమిన్ ' పి ' యొక్క రసాయన నామం ' మెస్పిరిడిన్ చాల్ క్లోన్ '.నీటిలో కరిగే ఈ విటమిన్ పుల్లని పండ్లలోనూ ,ఆకుపచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది.

Monday, 3 September 2018

తేమ వల్ల ఇనుము ఎందుకు తుప్పు పడుతుంది?



గాలిలోని ఆక్సీజన్ ,లోహం ఉపరితలం మీద చర్య జరపడం వల్ల ఆక్సీకరణం జరుగుతుంది.దీని ఫలితమే ఇనుము తుప్పు పట్టడం.దీని వల్ల ఆ వస్తువు బరువు పెరుగుతుంది.

Friday, 31 August 2018

శీతల వాతావరణంలో కొండలు పెద్దవిగా కనిపిస్తాయి.ఎందుకు?



వాతావరణంలో నీటి బిందువులు ఉండటం వల్ల వక్రీభవన గుణకం పెరుగుతుంది.అందువల్ల ప్రతి వస్తువూ కొణాకారంగా మారుతుంది.కావున శీతల వాతావరణంలో కొండలూ, ఇతర వస్తువులూ పెద్దవిగా కనిపిస్తాయి.

వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?

ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...