నీటి అణువుల మధ్య ఉండే సంసక్తం తో పోలిస్తే నీటి అణువులకూ ,గ్లాసుకూ మధ్య ఉండే అసంసక్తం ఎక్కువ.పాదరసం విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.
Wednesday, 21 November 2018
నీటి వల్ల గ్లాసుకు తడి అంటుతుంది,కాని పాదరసం వల్ల అంటదు,ఎందుకు?
నీటి అణువుల మధ్య ఉండే సంసక్తం తో పోలిస్తే నీటి అణువులకూ ,గ్లాసుకూ మధ్య ఉండే అసంసక్తం ఎక్కువ.పాదరసం విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.
Saturday, 17 November 2018
ఆనకట్ట మందం పై నుంచి అడుగుకు పోయే కొద్దీ పెరుగుతుంది,ఇలా రూపొందించటానికి గల కారణమేమిటి?
కిందికి పోయే కొద్ది పార్శ్వ పీడనం పెరుగుతుంది.ఇది పై భాగాన శూన్యంగా ఉంటే కింది భాగాన గరిష్టంగా ఉంటుంది.అందువల్లనే ఆనకట్ట అడుగు భాగం పై భాగం కంటే ఎక్కువ మందంగా ఉంటుంది.
Saturday, 8 September 2018
విటమిన్ ' పి ' అంటే ఏమిటి ?
విటమిన్ ' పి ' యొక్క రసాయన నామం ' మెస్పిరిడిన్ చాల్ క్లోన్ '.నీటిలో కరిగే ఈ విటమిన్ పుల్లని పండ్లలోనూ ,ఆకుపచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది.
Monday, 3 September 2018
తేమ వల్ల ఇనుము ఎందుకు తుప్పు పడుతుంది?
గాలిలోని ఆక్సీజన్ ,లోహం ఉపరితలం మీద చర్య జరపడం వల్ల ఆక్సీకరణం జరుగుతుంది.దీని ఫలితమే ఇనుము తుప్పు పట్టడం.దీని వల్ల ఆ వస్తువు బరువు పెరుగుతుంది.
Friday, 31 August 2018
శీతల వాతావరణంలో కొండలు పెద్దవిగా కనిపిస్తాయి.ఎందుకు?
వాతావరణంలో నీటి బిందువులు ఉండటం వల్ల వక్రీభవన గుణకం పెరుగుతుంది.అందువల్ల ప్రతి వస్తువూ కొణాకారంగా మారుతుంది.కావున శీతల వాతావరణంలో కొండలూ, ఇతర వస్తువులూ పెద్దవిగా కనిపిస్తాయి.
ఎండ మండిపోతున్న రోజు కూడా సరస్సులో నీరు చల్లగా ఉంటుంది.ఎందుకు?
గుప్తోష్ణం రూపంలో ,విశాలంగా ఉండే సరస్సు ఉపరితలం నుంచి జరిగే భాష్పీభవన కాలంలో నీటి నుంచి గణనీయమైన మొత్తంలో ఉష్ణం వదిలిపోవడం వల్ల ఎంత ఎండ
లోనైనా సరస్సులో నీరు చల్లగా ఉంటుంది.
Tuesday, 28 August 2018
ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ?
ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ?
తలతన్యత నియమాన్ననుసరించి ద్రవాలు గుండ్రని బిందువులుగా మారతాయి
తలతన్యత నియమాన్ననుసరించి ద్రవాలు గుండ్రని బిందువులుగా మారతాయి
Subscribe to:
Posts (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...