▼
Monday, 24 April 2017
మనకు ఎలా వినిపిస్తుంది? / MANAKU YELA VINIPISTHUNDHI?
చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి.బయటకు కనిపించే బాహ్యచెవి,మధ్య చెవిలను విడదీస్తూ సన్నని కాగితం పొరలాంటి కర్ణభేరి ఉంటుంది.ఇది ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉన్న మూడు చిన్న ఎముకలకు అతుక్కుని ఉంటుంది.బయటి చెవి ముందుగా శబ్దాన్ని గ్రహిస్తుంది.శబ్దం కర్ణభేరికి చేరగానే అది అటూ ఇటూ కదులుతూ కంపనాలను సృష్టిస్తుంది.అపుడు ఉత్పత్తయిన తరంగాలు మధ్య చెవిని చేరతాయి.అక్కడ ఉండే మూడు ఎముకలు ఆ తరంగాల తీవ్రతను రెండింతలు చేసి ,లోపలి చెవికి బదిలీ చేస్తాయి.అక్కడి నుంచి విద్యుత్ తరంగాలుగా మార్పు చెందిన శబ్ద తరంగాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరతాయి.మెదడులోని ఆడిటరీ విభాగం దానిని విశ్లేషిస్తుంది.అప్పుడు మనం వినగలుగుతాము.
అగ్గి పుల్ల ఎలా అంటుకుంటుంది? / AGGI PULLA YELA ANTUKUNTUNDI?
అగ్గిపుల్ల తలకాయను భాస్వరం,మరికొన్ని ఇతర పదార్థాలతో తయారు చేస్తారు.భాస్వరం అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్దే సులభంగా అంటుకుంటుంది.అగ్గిపుల్లను మనం కాస్త గరుకుగా ఉండే అగ్గిపెట్టె పక్క భాగంలో వేగంగా రుద్దినప్పుడు ఆ భాగానికి ,అగ్గిపుల్ల తలకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉష్ణశక్తి పుడుతుంది.అంతే ,ఈ వేడికి అగ్గిపుల్ల వెంటనే అంటుకుని మండటం మొదలుపెడుతుంది.సినిమాల్లో కొందరు హీరోలు చేతుల మీద ,కాళ్ళమీద అగ్గిపుల్లలను గీసి వెగించడం మనం చూస్తుంటాము.సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు.ఐతే వేడిగా ఉన్న బండల మీద ,గోడల పైన అగ్గిపుల్లలను గీసి వాటిని అంటించడం మాత్రం సాధ్యమయ్యే విషయమే.